నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 3
అతి తక్కువ టైంలో ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రోడక్ట్ కంపెనీస్ అన్నింటిలో తన బ్యూటీ ప్రోడక్ట్ కంపెనీని, ది ఫస్ట్ అండ్ ది బెస్ట్ గా’ తీర్చి దిద్దాడని అంటారు.’ చూడాలి అని అనుకుంది స్వప్నిక..
ఈ కంపెనీ చైర్మన్ చాలా అందగాడని, ఇంకా పెళ్ళి కాలేదని అందరికీ తెలుసు. కాని ఇప్పటికి అతని ఫోటో ఒక్కటి కూడా బయటకి రాలేదు.
అతనికి ఎంత టాలెంట్ ఉందో, బయటి వాళ్ళ నుండి అంత త్రెట్ ఉంది. కానీ ఇండియాలో హైదారాబాద్ లొ మొట్ట మొదటిసారిగా అతను మీడియా ముందుకు వస్తున్నాడు.
రాబోయే చైర్మన్ గురించి స్వప్నికకి కాస్త తెలుసు. కానీ అతడు, ఆమె జీవితాన్ని మార్చేస్తాడని అస్సలు ఉహించలేదు.
కాసేపట్లోనే ఆమె కారు ఆఫీసు ముందు ఆగుతుంది.. పార్క్ చేసి ముందుకు వస్తున్న స్వప్పికకి ఒక పెద్ద హోర్డింగ్ కనిపించింది.
అందులో వెన్నెల వెలుగులో గోల్కొండ కోట కనిపిస్తోంది. పైన ఆకాశం, నక్షత్రాలు చంద మామ ఉన్నాయి.
కింద లాన్లో లేత నీలిరంగు లాంగ్ ఫ్రాక్ వేసుకున్న ఒక అందమైన అమ్మాయి, రెండు వైపులా చేతులు చాపి పైకి చూస్తూ నిలబడింది.
ఆమె చూపులు దిగంతాల అంచుల దాక సాగి ఏదో వెతుకుతున్నాయి. ఆ మోడల్ పక్కన…
“అందం అనేది, ఆకాశం, వెన్నెల, నక్షత్రాలు.. ఏ ఒక్కదాని సొంతం కాదు. అందం మన సొంతం కూడా. అది ఎప్పుడు? ఎస్.ఎన్.ఎస్ బ్యూటీ క్రీమ్ మనం వాడినప్పుడు.” అనే కాప్షన్ రాసి ఉంది.
స్వప్నిక కి ఆ యాడ్ లో మోడల్ స్టిల్ అంటే చాలా ఇష్టం. ఆమె ఒక్కసారి ఆ హోర్డింగ్ ని తనివి తీరా చూసి ఆఫిస్ లోకి అడుగు పెట్టి షాక్ అయ్యింది..
తన క్యబిన్ లోకి వెళ్ళిన ఆమె మురళి, కావ్య ఇద్దరిని చూడగా వాళ్ళు స్వప్నిక దగ్గరికి వచ్చీ, ఆమె తన చెయిర్ లో కూర్చోగానే వాళ్ళిద్దరూ ఆమె ముందు ఉన్న చెయిర్స్ లో కూర్చున్నారు.
“వాట్, యార్, ఎప్పుడూ నువ్వే ముందొస్తావ్. అలాంటిది ఇంత లేట్ గా వచ్చావేంటి” అని గాభరగా అడుగుతున్న మురళి మాటలకు,
” మురళి, నీకొక విషయం తెలుసా? అసలు వాచ్మెన్ కన్నా ముందొచ్చేదీ, వాచ్మెన్ తరువాత ఇంటికి వెళ్ళేది ఈ పెద్ద జాబ్ వాళ్ళే” అంటూ గట్టిగా నవ్వింది కావ్య.
ఆమె నవ్వుకు అదిరిపోయిన స్వప్నిక,
“ఏయ్? ఏంటా నవ్వు? రూమంతా అదిరిపోతుంది. ఇక ఆపు” అని ఇరిటేట్ అవుతూ అన్న స్వప్నిక మాటలను పెద్దగా పట్టించుకోకుండా కావ్య,
“అబ్బ, స్వప్నీ, పోదూ, సిల్లీ ఫార్మల్టీస్. ఇంకా అవసరమా?” అని చూయింగమ్ నములుతూ అంది కావ్య.
“అవును మరి. రేపటి నుండి ఉంటుంది మజా. కొత్తగా వచ్చే బాస్ చాలా స్ట్రిక్ట్, కోపిస్టీ అంట. ఉన్న ఎంజాయ్ అంతా ఈ ఒక్క రోజే చేయాలి మరి” అని ఇంకా భయ పెట్టిన మురళి మాటలకు,
ఆ వచ్చే వ్యక్తి ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కాని స్టాఫ్ అంతా అతను అందగాడిని, వెరీ టాలెంటెడ్ అనీ మెచ్చుకుంటూనే మరో పక్క చాలా స్ట్రిక్ట్ అని, పని రాక్షసుడని అంటున్నారు. ఏది ఏమైనా స్వప్నిక కి మాత్రం టెన్షన్ గా ఉంది.
తను ఈ ఆఫిస్ లో జాయిన్ అయినప్పటినుండి మల్లిక మేడమ్ బాస్ గా ఉన్నారు. ఇన్ని రోజులు ఆమెతో చాలా బాగా గడిచింది. ఆమె వెళ్ళిపోతుందని తెలియగానే లోలోపల దిగులుగా ఉంది.
స్వప్నిక చాలా ఒంటరిగా ఫీలయ్యింది. ఏదో ఆలోచనల్లో మునిగిపోయిన ఆమెను చూసిన కావ్యా,
“ఏంటి తల్లీ, ఏదో ఆలోచనల్లో మునిగిపోయావ్? ఏంటి సంగతీ?” అని అడిగింది కావ్య.
ఇంతలో మురళి కాఫీ కోసం బెల్ నొక్కగానే, ఎవరూ రారు.వీళ్ళు రోజు కంటే కొంచెం ముందుగానే వచ్చారు. అతనే బయటకు వెళ్ళిపోతాడు.
కావ్య వైపు చూస్తూ,
“ఏం లేదు కవీ, మీరంటే నేను చెప్పిన ఆఫీస్ వర్క్ చేస్తారు. కానీ నాది డైరెక్ట్ గా బాస్ తోనే డీలింగ్స్. అందుకే అతని దగ్గరా నేనూ…” అని ఆగిపోయింది స్వప్నిక.
ఆ మాటలకు నవ్విన కావ్య,
“ఆ, నాకు అర్థమైంది. నీకు అతని కింద నలగాల్సి వస్తుందేమోనని భయం అంతేనా?” అని వచ్చే నవ్వును ఆపుకుంటూ అంటున్న కావ్యను గమనించని స్వప్నిక ఎటో ఆలోచిస్తూ,
“అవునే, అదే నాకు చాలా టెన్షన్ గా ఉంది.” అని అంటున్న స్వప్నికకి ముసి ముసి నవ్వులు వినిపించాయి.
“నువ్వు అతని గురించి ఏ లెవల్లో ఆలోచిస్తున్నావో తెలుస్తూనే ఉంది” అని ఐ వింక్ చేస్తున్న కావ్వను చూడగానే ఆమెకు ఏదో డౌటొచ్చీ,
“ఏంటే నవ్వుతున్నావ్?” అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక.
ఆమెను చూసి మళ్ళీ నవ్విన కావ్య.
“నేనేమన్నాను?” అని సీరియస్ గా అడగడంతో
ఆశ్చర్యంగా చూసిన స్వప్నికా
“హా, ఏమన్నావ్? అతని కింద నెగల..” ఏదో అర్థమై మధ్యలోనే ఆపేసి కోపంగా,
“యూ స్టుపిడ్, ముందు నీ లాంగ్వేజ్ ని కంట్రోల్ చేస్కో. ఎప్పుడు డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతావ్., ఒక్కసారి ఆ మురళికి చెప్పి నీ నాలుక కత్తిరించమంటానాగు.” అని మళ్ళీ కావ్యను కోప్పడింది స్వప్నిక.
దానికి కావ్య నవ్వుతూ,.
“నీ ముఖం. వాడేం చేస్తాడు? అసలు ఈ మాటలు నచ్చే వాడు నావెంట పడుతున్నాడు తెలుసా?” అని టెంపర్గా చెబుతున్న కావ్యని చూసి,
“ఖర్మ, ఖర్మ నీతో పెట్టుకున్నాను చూడు?” అని తల కొట్టుకుంది స్వప్నిక.
“నాతో వద్దు కానీ ఆ బాసుగాడితో పెట్టుకో. అతనూ ఒంటరిగాడంట కదా, నువ్వూ ఒంటరే.ఇద్దరికీ జోడీ సరిగ్గా సరిపోతుంది.” అని మళ్ళీ ఐ వింక్ చేస్తుంది కావ్య.
దానికి చాలా కోపం వచ్చిన స్వప్నిక,”నిన్నూ” అని చేయెత్తగానే..
దానికి భయపడ్డట్టు చేతులడ్డం పెట్టిన కావ్యా, మురళీ అటెండర్ తో మూడు కాఫీలు తెప్పించుకు రావడం చూసీ,
“ఏంటీ మురళీ, కాఫీకి ఇంత లేటా?పట్టుకొచ్చావా? లేక పెట్టుకొచ్చావా?” అని అంది కావ్య.
“ఆ, పట్టించుకొచ్చాను. కాఫీ పెట్టాలంటే నిన్నే పంపేవాణ్ణి” అని వెక్కరించాడు మురళి.
ముగ్గురూ సాయంకాలం జరిగే ప్రోగ్రాం గురించి మొత్తం మాట్లాడుకునీ, ఇంకా ఏవైనా పెండింగ్ వర్క్స్ ఉన్నయా అని చెక్ చేసుకున్న
తరువాత సాయంత్రం ఆరు గంటల వరకు ప్రోగ్రాం వెన్యూ దగ్గర కలుసుకుందామని అనుకున్న తర్వాత.. స్వప్నిక తన కారులో, మురళి బైక్, కావ్య తన స్కూటీ పై ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.
స్వప్నిక అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ లొ ఆమె ఎదుర్కోబోయే సమస్య ఏంటి?? తెలుసుకోడానికి తరువాతి ఎపిసోడ్ చదవండి..
హాయ్ ఎవ్రీ వన్… కథ మీ మనసును తాకితే తప్పకుండా మంచి రేటింగ్ ఇచ్చీ. కామెంట్స్ తో మీ అభిప్రాయాన్ని నాతో పంచుకుని సపోర్ట్ చేయండి.. స్టోరీని ప్రమోట్ చేయండి.. థ్యాంక్యూ🙏
(కొనసాగుతుంది)
Swipe left/right or tap the sides to turn pages