ఎపిసోడ్ 42
”శీతల్, ఒక్ల నిమిషం రండి.” పిలిచాడు విజె. శీతల్ భయపడుతూ ముందుకొచ్చింది.
ఆమెను చూసిన లాస్య ముఖం మాడిపోయింది.
“ఈమె పేరు శీతల్, ఇక్కడ పెద్ద బ్యూటీ పార్లర రన్ చేస్తుంది. మేడం, మీరు వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పండి.”
“సర్, నిన్న సాయంత్రం కరెక్ట్ గా ఆరు గంటలకు లాస్యా మేడం నాకు ఫోన్ చేసి తన ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయిందని రేపు మేకప్ అవసరం లేదని చెప్పింది.” అని అంది శీతల్.
“ఈరోజు ఉదయం నాలుగ్గంటలకు పేపర్స్, ఏడుగంటలకు యూట్యూబ్, టివీలల్లో ఆ న్యూస్ వచ్చింది. ఓకె. ఒప్పుకుంటాను.