అర్జున్ ❤️ మేఘన
ఎపిసోడ్ 7: నీ చూపుల్లో ఏదో ఉంది… ❤️🔥
ఆదివారం ఉదయం.
అర్జున్ బాల్కనీలో కాఫీ తాగుతూ ఎదురుగా ఉన్న మేఘన ఇంటివైపు చూస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆమెతో మాట్లాడిన మాటలే అతని మనసులో తిరుగుతున్నాయి.
మేఘన కూడా తన గదిలో అద్దం ముందు నిలబడి జుట్టు సరిచేసుకుంటోంది. బాల్కనీలోకి వెళ్లబోతూ ఎదురుగా అర్జున్ కనిపించడంతో ఒక్క క్షణం ఆగింది.
“అయ్యో, మళ్లీ నన్నే చూస్తున్నారేమో!” అనుకుంటూ తనలో తానే నవ్వుకుంది.