11వ భాగం
ఇంటికి వెళ్ళిన విక్రమ్ డైరెక్ట్ గా తన రూమ్ కి వెళ్ళిపోతాడు..
వాష్ రూమ్ కి వెళ్ళి షవర్ ఆన్ చేసి షవర్ కింద ఉంటాడు.. అలా ఒక 10 మినిట్స్ కి బయటకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫోన్ తీసుకుని విజ్జు కి మెసేజ్ చేస్తాడు..
ఆ తరువాత బాల్కనీ లోకి వెళ్ళి అలాగే అక్కడ ఉన్న జామ చెట్టు వైపు చూస్తాడు.. కొంచెం సేపు అలాగే ఉండి తను రేపు చేయాల్సిన వర్క్ గురించి ఆలోచిస్తాడు..
ఇంతలో జయ గారు, విక్రమ్ గదికి వస్తారు.. రూమ్ అలికిడి అవ్వడంతో లోపలికి వచ్చిన విక్రమ్ అక్కడ జయ గారిని చూసి..
“ఏంటి నానమ్మ ఏమైనా చెప్పాలా?” అని అడుగుతాడు..