భాగం – 7
ఇలా ఉన్న వీరి జీవితాల్లోకి విషపురుగుల్లా జొరపడ్డారు ఆ పట్నం కుర్రాళ్ళు.
పచ్చగా ఉన్న పంటని ఒక పాడు పురుగు తొలి చేసినట్టు ఎంతో సంతోషంగా, చల్లగా బతుకుతున్న వాళ్ల బ్రతుకులని అతలా కుతలం చేసేశారు…
వచ్చిన వాళ్ల కోసమని సీత, నీరజ అలాగే లక్ష్మి ముగ్గురు కలిసి భోజనాలు తీసుకొస్తున్న సమయానా,
పుత్తడి బొమ్మలా ముద్ద బంతిలా లంగా వోణీలో ఈ లోకం లోని అందానికే రూపు దాల్చిన శిల్పంలా, అందమైన వొంపులు తిరిగిన దేవ కన్యలా నవ్వుతూ మెరుస్తూ నడుచుకొస్తున్న సీతను చూసిన ఆ కుర్రాలలోని ఒక కుర్రాడి కళ్ళు మెరిసి పోయాయి మిల మిల మంటూ.
అవి చూసిన ఆ పక్కనే ఉన్న ఇంకొక కుర్రాడు అతని చూపులని చూసి అటుగా చూస్తూ, “ఆహా ఏముంది రా పిల్ల. ఏంటి సెట్ చేయమంటావా అంత నచ్చినట్టుంది.”