భాగం – 9
అతను నసుగుతుంటేనే, “ఎవరో కాదు ఈ గూడెం పెద్దయ్య వచ్చాడు” చెప్పాడు గౌతమ్.
గౌతమ్ మాట వినగానే గుండె దల్లుమని వెంటనే వాళ్ళు చేస్తున్న పనిని ఆపేసి వాళ్ళ ముందర ఉన్న లిక్విడ్ బాటిల్స్ అన్నిటిని ఒక సైడ్ కి భద్రంగా దాచి పెట్టేశారు.
వాళ్ల కంగారు చూసి, “ఎందుకు రా అంత దాచుతున్నారు ఏమైంది..? ఏముంది దాంట్లో..?” విషయం తెలియని గౌతమ్ నార్మల్ గానే అడిగాడు.
అతని మాటలకి, “ఏంట్రా వీడికి మేటర్ తెలియదా..?” పక్కనున్నోడిని అడుగుతుంటే,
“తెలియదు రా వాడితో ఇంకా చెప్పలేదు ఊరికే మంచి మంచి అని అడ్డు చెబుతాడని.”