New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 38

పెళ్లి చూపులు – 38

పెళ్లి చూపులు -38

 

“మరి నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు” అని సిరి ఇక తనకు దక్కదు అని బాధతో అడిగాడు రవి.

 

“అంటే అది అంటే అది..!” అని తడబడుతూ నానుస్తూ ఒక క్షణం సిరి వైపు చూస్తూ ఆ మరుక్షణం రవి వైపు చూస్తూ ఉన్నాడు తప్ప ఇది అని విషయం మాత్రం చెప్పలేకపోతున్నాడు వైష్ణవ్, ఎలా చెప్తాడు అందులో నిజం ఉంటే కదా చెప్పడానికి 

 

“అబ్బా ఏంటి వైష్ణవ్ మన పెళ్లి గురించి చెప్పడానికి కూడా నువ్వు అంత ఇబ్బంది పడిపోతున్నావ్, నేనంటే నీకు చాలా ఇష్టమని ఆరోజు పెళ్లిచూపుల్లో చెప్పావు కదా, అదే ఇష్టం ఇక్కడ మన ఫ్రెండ్స్ ముందు చెప్పటానికి ఏమైంది..?” అని తెగ సిగ్గు పడిపోతూ అన్నది సిరి..

 

“ఏంటి ఏంటి ఆ రోజు నువ్వంటే ఇష్టమని నేను చెప్పానా.?’ అని మనసులో అనుకొని “అది ఏం లేదు బ్రో ఇంకా మాకు ఎంగేజ్మెంట్, పెళ్లి ముహూర్తాలు పెట్టలేదు కదా, అలా ముహూర్తాలు పెట్టిన తర్వాత ఫస్ట్ మీకే చెప్పాలి అనుకున్నాను, అందుకే చెప్పలేదు” అని ఏం చెప్పాలో అర్థం కాక అలా చెప్పేసాడు ఆ సమయానికి 

 

“సిరి నిజంగానే నువ్వు వైష్ణవ్ ని ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా..?” అని అడిగాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue