పెళ్లి చూపులు -42
సీసీ ఆఫ్ చేయాలి అని అటువైపు ఉన్న ఏరియా దగ్గరకు వెళుతూ ఉండగా అప్పుడే సిరి కూడా అటువైపే వెళుతూ ఉండటం గమనించి ఇప్పుడు ఇక్కడికి సిరి ఎందుకు వస్తుంది అని అనుకుంటూ ఆమె వెనకే వెళ్ళింది గౌతమి.
అటువైపు ఎవరూ రారు తన పేరెంట్స్ తో ఫోన్ మాట్లాడటానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అటువైపు వచ్చింది సిరి..
ఆ అవకాశాన్ని కూడా ప్లస్ చేసుకోవడానికి గౌతమి సిరి ఫోన్ మాట్లాడుతున్న టైం లోనే తను చేయాలి అనుకున్న పనులు చేసేసింది సిసి ఆపరేట్ చేసే వ్యక్తి కూడా లంచ్ తినడానికి బయటకు వెళ్లడంతో తనకి కరెక్ట్ టైం అనిపించడంతో సీసీ కొన్ని నిమిషాల పాటు ఆఫ్ చేసేసి మరలా వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గరకు వచ్చి ఏమీ తెలియని దానిలా కూర్చుంది
నార్మల్గా అందరూ లంచ్ తిని వచ్చి కూర్చున్నారు వైష్ణవ్ కూడా తన ప్లేసులో కూర్చుంటూ ఉన్నప్పుడే విజయేంద్ర గారు ఫోన్ చేయడంతో బయటకు వెళ్లిపోయాడు
ఇదేంటి ఎక్కడికో ఫోన్ వస్తే వెళ్ళిపోతున్నాడే ఇక్కడ జరిగే సీను చూద్దామనుకుంటే మిస్ అయిపోతుందే అని అనుకుంటూ ఉన్న గౌతమి ఇప్పుడు బయటకి ఎక్కడికి వెళ్తున్నాడు ఈ వైష్ణవ్ అని అనుకుంటూ వైష్ణవ్ వెనకే వెళ్ళింది గౌతమి..