పెళ్లి చూపులు -60
నువ్వు అన్నట్లు పెళ్లి చూపులకు రాక ముందు వరకు నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను.. కానీ పెళ్లి చూపులకి వచ్చిన తర్వాత మాత్రం నువ్వే నా లైఫ్ పార్టనర్ అని నేను ఫిక్స్ అయిపోయాను అని అన్నాడు రవి.
నిజంగా నీ మనస్ఫూర్తిగా పెళ్లికి ఒప్పుకున్నట్టే కదా అని చిన్నగా కళ్ళు మాత్రమే పైకెత్తి అడిగింది తల మాత్రం కిందకు దించుకునే ఉంది రమ్య.
రవి అటూ ఇటూ దిక్కులు చూసి, ఎవరు కూడా తమను చూడటం లేదు అని గమనించి రమ్య రెండు చేతులను పట్టుకొని పైకి లేపాడు.
అతడు ఏం చేస్తున్నాడు అని అనుకునే లోపే ఆమె అతడు ఒడిలో వచ్చి కూర్చుంది.