పెళ్లి చూపులు -66
“నష్ట జాతకురాలు అని అందరూ నిన్ను అంటున్నారేమో కానీ నాకు మాత్రం నువ్వు లక్కీ పర్సన్ నా లక్కీ నువ్వే నువ్వు ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ చేసి అనుకోవద్దు” అని ఆమె ఫేస్ ని రెండు చేతుల్లోనికి తీసుకొని నుదుటిమీద ముద్దు పెట్టి మరొకసారి ఐ లవ్ యు చెప్పాడు..
సిరికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక అంతే వైష్ణవ్ వైపు చూస్తూ ఉంది..
“ఏంటి సిరి అలా చూస్తున్నావ్ ఇప్పుడు సడన్గా నా అంతట నేనుగా నీకు ఐ లవ్ యు చెప్పాను అనా,, లేకపోతే నీ బాధని చూసి నేను నీకు ముద్దు పెట్టి ఐ లవ్ యు చెప్పాను అని ఫీల్ అవుతున్నావా..? అలా నువ్వు ఫీల్ అయితే మాత్రం పొరపాటే..
ఎందుకంటే ఆ రోజు నేను నిన్ను పెళ్లి చూపుల్లో చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావ్, అంటే చెప్పాను కదా పెళ్లి చేసుకుని ఇంట్రెస్ట్ నాకు అప్పుడే లేదు అందుకే నువ్వు అడిగినప్పుడు నో చెప్పాను కానీ ఆ తర్వాత నువ్వు తల కొంచెం క్రాస్ గా తిప్పి నా వైపు కళ్ళు సగం మూసి సగం తెరిచి చూసావ్ చూడు ఆ చూపుకి పడిపోయాను…
అప్పుడే అప్పుడే నాకే తెలియకుండా నీ మీద నాకు ప్రేమ పుట్టేసింది అది ఒక్క చూపుకా అని అడిగితే నేను సమాధానం చెప్పలేకపోవచ్చు కానీ నువ్వంటే నాకు ఇష్టం. ఆ విషయాన్ని వెంటనే నీకు చెప్పేయాలి అనుకున్నాను. కానీ