New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమ వెన్నెల🌙❤️ – 4

ప్రేమ వెన్నెల🌙❤️ – 4

“సుజాతా…. నీకు విషయం తెలిసిందా…. మీ దక్షిణం వైపు ఇంట్లో ఉండే షినీ ఉంది కదా…. దాని కూతురు ఉరేసుకుందట….. అక్కడికక్కడే చనిపోయిందని తెలిసింది….”

 

అయ్యో దేవుడా…. ఆమీ పాపనా…..! సుజాత ఆ విషయం విని ఒక్కసారిగా షాక్ అయిపోయింది….

 

“నిన్న కూడా ఆ పిల్లతో మాట్లాడానే నేను…. హ్మ్… ఆ పిల్ల ఉరేసుకోకపోతేనే ఆశ్చర్యపోవాలి…. మనశ్శాంతి అంటే ఏంటో ఆ పిల్లకు తెలుసా? ఎవరో పనికిమాలిన వాళ్లు చెప్పిన మాటలు విని ఆ పిల్ల మీద విరుచుకుపడటం తప్ప దానికి ఇంకేం చేతనవుతుంది….” శోభన వైపు కోపంగా చూస్తూ సుజాత అంది.

 

ఆ మాటలు శోభనకు గట్టిగానే తగిలాయి.

 

“అదేంటి… లేనిపోనివి ఎందుకు చెప్తున్నావు సుజాతా…. ఆ పిల్ల ఉరేసుకుంటే అది తన తప్పే…. నిన్న ఆ నందనం ఇంటి గడప దాటి లోపలికి వెళ్లడం నేను చూశాను సుజాతా…. ఆ విషయం షినీకి తెలిసే ఉంటుంది….”

 

“ఆహా… శోభనకు అన్నీ తెలుసన్నమాట…. మరి ఉరేసుకున్నప్పుడు కేసు, విచారణ అన్నీ ఉంటాయి కదా…. అప్పుడు సాక్ష్యం చెప్పడానికి నిన్ను కూడా పిలుస్తారేమో….”

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue