ఏ విషయం అనేది పంతులు గారితో కబురు చేయిస్తాను మేము బయలుదేరుతాం అని లేస్తారు వర్మ గారు తన ఇద్దరి మనవళ్లు…
గది నుండి బయటకి వచ్చిన అమ్మాయి చెంప పై శౌర్య చేతి వేళ్ళు నాలుగు కనబడుతుంటే అరణ్య్ పెదవులు ఓ వైపుకి సాగితే… వర్మ గారి కళ్ళు పెద్దవి అవుతాయి….
పదండీ తాతయ్య అని శౌర్య నే ముందుకి నడిస్తే మనవడిని ఫాలో చేస్తారు తాతగారు ఆ వెనకే వెళ్తున్న అరణ్య్ ఇచ్చిన లుక్ కి వాళ్ళ అమ్మ వెనక నిలబడి దాక్కుంటుంది ఆ అమ్మాయి…
ఇక్కడ పెళ్లి చూపులు… అర్చిత కి శౌర్య కి కాదు వేరు వేరు పర్సన్స్ తో.. ఒకేరోజు ఒకే సమయంలో జరిగాయి