New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనసులు కలిసిన వేళ❤️ – 17

మనసులు కలిసిన వేళ❤️ – 17

ఉదయం ఎనిమిది గంటలకే గ్రామంలోని పాత పాఠశాల ప్రాంగణం జనాలతో నిండిపోయింది.

 

పాఠశాల ఆవరణలో వరుసగా కుర్చీలు వేయించారు. ఒకవైపు రిజిస్ట్రేషన్ కోసం టేబుళ్లు, మరోవైపు రక్తపరీక్షలు చేసే ఏర్పాట్లు, ఇంకోవైపు మందులు పంపిణీ చేసే గది సిద్ధంగా ఉన్నాయి.

 

వైద్య శిబిరం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది వచ్చారు.

 

ఎండ ఇంకా పూర్తిగా పెరగకముందే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు.అందరినీ సమన్వయం చేస్తూ త్రిపుర అటూ ఇటూ తిరుగుతోంది.

 

“అమ్మా, ముందు ఆ పెద్దవాళ్లను కూర్చోబెట్టండి. ఎండలో ఎక్కువసేపు నిలబడకూడదు.”

 

“రమ్యా! పిల్లల పేర్లు నమోదు చేశావా? వాళ్లకు ప్రత్యేకంగా పరీక్షలు చేయించాలి.”“డాక్టర్ గారూ, ఈ మందుల జాబితా ఒకసారి చూడండి. ఏమైనా మిస్సయ్యాయేమో!”ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండటం లేదు ఆమెకు.ఆమె పరుగులు చూస్తున్న సూర్యాన్ష్ నవ్వుతూ దగ్గరకు వచ్చాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue