ప్రేమలో పడితే -25
“సార్ నాకు ఇలా వర్క్ చేయటం అస్సలు ఇష్టం లేదు. లాటరీ సిస్టంలో తీసినట్లుగా నాకు ఉన్న దరిద్రానికి మీ కింద పిఎగా సెలెక్ట్ అయ్యాను. అందుకని నన్ను పిఎగా డిస్మిస్ చేసేసి రమ్యని లేదంటే గణేష్ వాళ్ళిద్దరినీ మీకు పిఏ గా పెట్టుకోవచ్చు కదా సార్, వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తారు సార్” అని అమాయకంగా కళ్ళు టపటపా కొడుతూ చెప్పింది.
“అవునా..? వాళ్ళు వర్కు చాలా పర్ఫెక్ట్ గా చేస్తారా..?” అని శ్రీరామ్ అడిగితే అవును సార్ అని గంగిరెద్దుల తల నిలువుగా ఊపింది మహాలక్ష్మి..
“సరే అయితే నిన్న నువ్వు పేపర్స్ మీద సైన్ చేసావు. కాబట్టి నీకు ఎలాగూ నా కింద పిఎగా వర్క్ చేయడం ఇష్టం లేదు కాబట్టి నీ పోస్ట్ తో పాటు నీ ఫ్రెండ్స్ రమ్య గణేష్ ఇద్దరి పోస్ట్ కూడా తీసేసి కంపెనీ బయట నిలిచో పెడితే బాగుంటుందనుకుంటా” అని అన్నాడు శ్రీరామ్..
“వద్దులే సార్, ఈ పేపర్స్ మీద చైర్మెన్ గారి సైన్ కదా పెట్టించుకుని వస్తానులే” అని నిష్ఠూరంగా చెప్పి ఆ పేపర్స్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయింది కనీసం ఆ పేపర్స్ ఏంటి అనేది కూడా తను చూడలేదు.
చైర్మన్ ఈ కంపెనీకి చైర్మన్ గారు ఉన్నారా..? ఉంటే ఎక్కడ ఉన్నారు? ఆ చైర్మన్ గారి క్యాబిన్ ఎక్కడ ఉందో, ఈ మేనేజర్ ఇలా తల తిక్కగా ఉన్నాడు, ఇక ఆ చైర్మన్ గారు ఎలా ఉంటారో ఏంటో, నాకు పంజరంలో ఇరుక్కున్నట్లు అనిపిస్తుంది అని అనుకుంటూ, చివరికి పై ఫ్లోర్ లో ఉన్న చైర్మన్ గారి క్యాబిన్ కి వెళ్ళింది.