ఉదయం 7:30…
అనన్య ఇంకా ఇంట్లోనే ఉంది. రాత్రంతా ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయడంతో కాస్త ఆలస్యంగా నిద్రలేచింది. ఫోన్ తీసి చూసేసరికి అర్జున్ నుంచి వాట్సాప్ మెసేజ్ కనిపించింది.
Arjun: Where is the report?
Ananya: Good morning, sir. నేను ఆఫీస్‌కి వచ్చాక మీకు రిపోర్ట్ ఇస్తాను.
Arjun: I didn’t ask for your explanation. I asked for the report.
Ananya: అది మీ దగ్గరికి చేరుతుంది సర్. Don’t worry.
Arjun: Let’s see.
ఆ మెసేజ్ చూసి అనన్య ఫోన్ పక్కన పెట్టింది.
“ఈయనకి ఉదయం లేవగానే నా మీద కోపం రావాలా ఏంటి?” అంటూ తనలో తానే అనుకుంది.
“అనన్యా! టిఫిన్ రెడీ అయింది. త్వరగా రా!” అని తల్లి లక్ష్మి పిలిచింది.
“వస్తున్నానమ్మా!”
టిఫిన్ చేస్తూనే అనన్య మనసులో ఆఫీస్‌లో జరగబోయే మీటింగ్ గురించే ఆలోచిస్తోంది.