మినిస్టర్ భైరవమూర్తి, విక్కీల చాప్టర్ క్లోజ్ అవ్వడంతో హైదరాబాద్‌లోని శివ, సాహిత్యల ఫ్లాట్‌లో మళ్లీ పాత నవ్వుల కోలాహలం మొదలైంది. శృతి తన ఊరికి వెళ్ళిపోగా, కావ్య కూడా వైజాగ్‌కు బదిలీ అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఏ శత్రువుల భయం లేదు, ఏ మూడో వ్యక్తి డిస్టర్బెన్స్ లేదు. కేవలం కొత్తగా పెళ్లయిన ఈ అందమైన బావ-మరదళ్ల కాపురం మాత్రమే ఉంది.
మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలవుతోంది. శివ చాలా రోజుల తర్వాత ఆఫీస్ టెన్షన్లు అన్నీ పక్కన పెట్టి, టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ వేసుకుని హాయిగా సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. పక్కనే వేడి వేడి టీ కప్పు ఉంది.
సరిగ్గా అప్పుడు సాహిత్య వంటగదిలో నుంచి నడుచుకుంటూ వచ్చింది. ఈరోజు ఆమె ఒక అందమైన మోడ్రన్ కుర్తీ వేసుకుని, లూజ్ హెయిర్‌తో చాలా ఫ్రెష్‌గా కనిపిస్తోంది. కానీ, ఆమె చేతిలో ఒక పెద్ద ప్రపంచ పటం ముఖంలో ఏదో కొత్త కుట్ర తాలూకు చిలిపి నవ్వు ఉన్నాయి.
ఆమె మెల్లగా వచ్చి శివ పక్కన సోఫాలో దూరింది. అతని చేతిలోని పేపర్‌ను లాగి పక్కన పడేసింది.
“ఏంటి వైఫ్ గారూ! పొద్దున్నే పేపర్ చదవనివ్వకుండా ఇంత రౌడీయిజం చేస్తున్నారు?” అన్నాడు శివ నవ్వుతూ ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుంటూ.
“పేపర్ ఆ తర్వాత చదవచ్చు బావా.. ముందు ఈ మ్యాప్ చూడు. మన పెళ్లయి ఇన్ని రోజులవుతోంది, పెద్ద పెద్ద ఫైటింగులు, కిడ్నాపులు అన్నీ చూశాం కానీ.. కొత్తగా పెళ్లయిన మొగుడు పెళ్లాలు వెళ్లాల్సిన ఒక ముఖ్యమైన ప్రదేశానికి మనం ఇంకా వెళ్లలేదు” అంది సాహిత్య కళ్లు తిప్పుతూ.
“ముఖ్యమైన ప్రదేశమా? ఎక్కడికి రౌడీ?” శివ ఆశ్చర్యంగా అడిగాడు.
“ఇంకెక్కడికి బావా… ‘హనీమూన్’! మన కాలేజీ ఫ్రెండ్స్ అందరూ పెళ్లయ్యాక మాల్దీవులని, పారిస్ అని తిరుగుతున్నారు. నువ్వేమో నన్ను ఇంకా ఈ ఫ్లాట్ లోనే ఉంచావు. నాకు అర్జంట్‌గా హనీమూన్ ట్రిప్ కావాలి. ఫ్లైట్ టికెట్లు బుక్ చెయ్ బావా” అంది మ్యాప్ చూపిస్తూ మొండికేసింది.
శివ నవ్వాడు. “అబ్బో! మా మరదలు గారికి అప్పుడే హనీమూన్ కోరికలు పుట్టుకొచ్చాయా? సరే.. ఎక్కడికి వెళ్దాం చెప్పు? మాల్దీవులా? లేక స్విట్జర్లాండా?” అని అడిగాడు నడుము మీద చేతులు తిప్పుతూ.
స్విట్జర్లాండ్ వద్దు బావా, అక్కడ చాలా చలిగా ఉంటుంది. నువ్వేమో చలి తట్టుకోలేక రాత్రి పూట రగ్గు కప్పుకుని పడుకుంటావు, నన్ను పట్టించుకోవు. మనకు కాస్త రొమాంటిక్ గా, అంతే అల్లరిగా ఉండే ప్రదేశం కావాలి. నేనే ఒక ప్లేస్ సెలెక్ట్ చేశాను… ‘కేరళ బ్యాక్ వాటర్స్’! అక్కడ హౌస్ బోట్ లో ఇద్దరం మాత్రమే ఉంటాం. చుట్టూ నీళ్లు, కొబ్బరి చెట్లు… చాలా రొమాంటిక్ గా ఉంటుంది కదా బావా” అంది సాహిత్య శివ బుగ్గ గిల్లుతూ.