వీరేంద్ర గారు వైదేహి గారు కళ్యాణి దేవి గారి దగ్గర కి వెళ్తారు……
ఆవిడ గదిలో అటు ఇటు తిరుగుతూ ఫోన్ లో పంతులు గారితో మాట్లాడుతూ మీరు ఏం చేస్తారు అన్నది తెలియదు నేను పంపించిన జాతకం ఉన్న అమ్మాయి నాకు కావాలి అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేస్తారు….
ఏమయ్యింది అమ్మ ఏంటి జాతకం అమ్మాయి అంటున్నావు అని అడుగుతారు వీరేంద్ర గారు….
నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను ఇద్దరు కంగారు పడకుండా వినండి….
చెప్పు అమ్మ….
చెప్పండి అత్తయ్య ఏదో పెద్ద విషయమే అయ్యి ఉంటుంది అని కంగారుగా అడుగుతారు వైదేహి గారు….