కోపంగా బయటికి వెళ్ళిన క్రిష్ తన కోపం ఎవరి మీద చూపించాలి అని తెలియక తన లో తానే నలిగిపోతున్నాడు….
తన జీవితం లో కూడా తన ఇష్ట ప్రాకారం చెయ్యడానికి లేదు కనీసం తన లైఫ్ పార్టనర్ ను కూడా సెలెక్ట్ చేసుకునే రైట్ కూడా నాకు లేదా అనే ప్రశ్న తన లో తనే వేసుకుంటున్నాడు…..
ఎంతకి అతని కోపం బాధ తీరడం లేదు…. పబ్ కి వెళ్ళి ఒక ఫుల్ బాటిల్ ఆర్డర్ పెట్టీ తాగుతూ ఉంటాడు….
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
వచ్చావా విజయ్ ఏంటి ఈరోజు ఇంత లేట్ అయ్యింది…అని అడుగుతారు విజయ్ అమ్మగారు పార్వతి గారు….
అవును అమ్మ ఈరోజు కొంచెం పని ఉంది అందుకే లేట్ అయ్యింది….