భాను నోట్లో నుండి ఆ మాటలు వినగానే భరత్ కి రాత్రి ప్రణయ్ చెప్పిన మాటలు ఒక్కసారిగా గుర్తు వస్తాయి.. వాట్ అంటే ప్రణయ్ ఊహించింది నిజమా ప్రతిమాకు ఈ పెళ్లి నిజంగానే ఇష్టం లేదా..
అందుకే ఎవరికీ చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా వెళ్లిపోయిందా ఏంటి అంటూ అనుమానంగా రకరకాలుగా ఆలోచిస్తుంటాడు అతని మనసులో..
మళ్లీ వెంటనే ఊహు నేను అలా ఆలోచించడం కూడా తప్పే.. ముందు అసలు ప్రతిమ ఎక్కడ ఉందో ఎక్కడికి వెళ్లిందో ఏమి తెలుసుకోకుండా ఇలా నాకు నచ్చినట్టు నేను ఊహించుకోవడం కరెక్ట్ కాదు అనుకుని తను ఏదో మాట్లాడబోయే లోపు..
హహహ ప్రతిమ గురించా నీ కంగారు.. నేనింకా ఏం జరిగిందా ఏంటా ఉదయాన్నే అరుస్తున్నావు అనుకున్నాను కదా బంగారం..
నువ్వు చెప్తుంది నిజమే ప్రతిమ ప్రణయ్ గదిలో లేదు అని తాపీగా చెప్తారు యశోద గారు నవ్వుతు ..
తను అంత కంగారు పడిపోతున్న విషయంలో యశోద గారు అంత తాపీగా నవ్వుతూ సమాధానం చెప్పడం చూసి భరత్,భాను ఇద్దరికి ఒకంత ఆశ్చర్యం కలుగుతుంది..