మై డియర్ బీస్ట్ ❤️🔥 – 3
2nd ఎపిసోడ్ మళ్ళీ అప్డేట్ చేశాను ఒకసారి చూడండి..
*******************
“శ్లోక.. శ్లోక..”
ఉలిక్కిపడి లేచింది శ్లోక..భయం తో చేతులు వనికి పోతున్నాయి.. ఒళ్ళంతా చెమటలు.. తన ఊపిరి శబ్దం గుండె కొట్టుకునే సౌండ్ పైకి వినిపిస్తుంటే
గుండెని గట్టిగా పట్టుకొని
రూమ్ అంత కలియ చూసింది.
తన రూమ్ తన బెడ్ మీదే ఉంది.
బెడ్ షీట్ తీసి ఒళ్ళంతా తడుమి చూసుకుంది.. అంటే ఏమి కాలేదు..
పక్కన వాటర్ ఉంటే తాగింది ..
కొంచెం సేపటికి కానీ ఆమె స్థిమిత పడలేదు..
పక్కనే తన ఫ్రెండ్ హాయిగా పడుకొని ఉంది..
పదే పదే ఆ కల గుర్తు వస్తుంది కాని అతని మొహము గుర్తులేదు బ్లరీ గా ఉంది ..
చి ఇదేంటి ఎలాంటి కాల వచ్చింది , ఎవరతను ,నేను ఎందుకు అతనితో అంత దగ్గరగా ఉన్నాను…
జుట్టులో చేతులు బిగించింది
ఎంతకి అతని మొహం గుర్తు రాలేదు..
అతని వాయిస్ అతని బాడీ మాత్రమే కనిపించింది..
ఎంత గుర్తు చేసుకున మొహం గుర్తు రావట్లేదు.
అలానే ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంది శ్లోక ..
……………………………….
పొద్దునే పూజ సౌండ్ చేస్తూ తనని లేపే తన ఫ్రెండ్ నుంచి ఎటువంటి సౌండ్ లేక చూస్తే..
ఎప్పుడూ ఎర్లీ గా లేచే ఫ్రెండ్ ఇంకా లేవలేదు ఏమైంది దీనికి అంటూ
శ్లోక బేబీ అంటూ లేపింది నేహా
అయినా శ్లోక లేవలేదు..ఒళ్ళు చూసింది కొంచెం వేడిగా ఉంది ..
అయ్యో ఫీవర్ వచ్చింది అని ..
తనే ముందు గా ఫ్రెష్ అయ్యి శ్లోక కోసం సూప్ చేసి తీసుకొచ్చి మళ్ళీ లేపింది..
శ్లోక మెల్లగా కళ్ళు తెరిచింది..
లెగవే ఫీవర్ వచ్చింది .. ఫ్రెష్ అయ్యి ఈ సూప్ తాగి టాబ్లెట్ వేసుకుందువు .
మెల్లగా లేచి వాష్రో లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది..
నేహా చేసిన సూప్ తాగి టాబ్లెట్ వేసుకుంది..
బానే ఉన్నావు కదా నైట్ ఏమైంది అని అడిగింది నేహా..
“కొంచెం టైర్డ్ అయ్యా అంతే ఏమిలేదు”
“రెస్ట్ తీసుకు ఇక” అని నేహా అంటే
“లేదు ఈరోజు అర్జెంట్ వర్క్ ఉంది కదా”అంది శ్లోక
“నేను చూసుకుంటాను నువ్వు రెస్ట్ తీసుకో “అంది నేహా.
“నేను కూడా వస్తాను టాబ్లెట్ వేసుకున్నా కదా తగ్గిపోతుంది”
నేహా కోపము గా చూస్తూ నువ్వు మారవు.. అంది
శ్లోక చిన్న స్మైల్ ఇచ్చింది..
ఓహ్ మై క్యూట్ ఇలా నవ్వే నన్ను మెల్ట్ చేస్తునావు అనుకోని.
సరే వెళ్దాం..అని నేహా శ్లోక ఇద్దరూ రెడీ అయ్యారు..
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నేహా శ్లోక ఇద్దరు చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్..
ఇద్దరు ఒక ఆర్ఫన్ హోమ్ లో కలుసుకుని,కష్టపడి చదువుకున్నారు..
వాళ్ళకి ఎవరు లేరు అని బాధ పడకుండా.. ఇద్దరు ఒక ఫ్యామిలీ గా కలిసి ఉన్నారు..
చిన్న చిన్న జాబ్ తో మొదలు వేరే కంపెనీ లో జాబ్ చేస్తూ వాల్ల డైలీ ఖర్చులు వెళ్లదీసారూ..
ఇద్దరికి ఒక కోరిక చిన్న స్టార్ట్ అప్ లాగా ఈవెంట్ ఆర్గనైజేషన్ పెట్టి, వచ్చిన డబ్బు తో తమ లాంటి ఆర్ఫన్ పిల్లకి కనీస అవసరము,చదువు అందించాలని కోరిక ..
వాళ్ళు మంచిగా స్థిరపడి బిజినెస్ లో మంచిగా సంపాదించి వాల్లే ఆర్ఫన్ ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించాలి అని అలోచన లో ఉన్నారు.
అది అంత చిన్న విషయం కాకపోయినా వాళ్ళ కస్టముని నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు…
కలిసి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నారు
ఎన్నో బాధలు , అవమానాలు, అసహ్యం మాటలు, బెదిరింపులు .
ముందు బాధ పడ్డ ,మెల్లగా స్ట్రాంగ్ గా మారి ఎవరి అవసరం లేకుండా తమ కాళ్ళ మీద నిలబడ్డారు.
ఆది కూడా అంత ఈజీ గా ఏమి అవలేదు అనుకోండి..
కొన్ని సంస్థ ల నుండి డొనేషన్ తో తమ ఆర్ఫన్ హోమ్ నడిచేది..
వీరికి తెలిసిన కొన్ని కార్పొరేట్ సంస్థల నుంచి డొనేషన్స్ సాయం గా పొందే వారు..
ఈరోజు కూడా అదే పని గా ఒకరి నీ కలవాలి అని వారి ఆఫీస్ కి వెళ్దాం అనుకున్నారు..
అక్కడ నుంచి వల ఈవెంట్ ఆఫీస్ కి వెళ్లి తమ పని చేసుకోవాలి అని ఆ రోజు ప్లాన్..
ఇద్దరు కలిసి స్కూటీ మీద ట్రాఫిక్ ఈదుకుంటూ చాలా లేట్ గా ఒక పెద్ద సంస్థ కి చేరుకుని..
రిసెప్షనిస్ట్ వద్ద అడిగితే
సార్ అవుట్ ఆఫ్ వెళ్ళారని తెలుస్తుంది..
“సార్ఎపుడు వస్తారు” అని అడిగారు.
తెలీదు అంది..
ఉసూరుమంటూ తిరిగి ఈవెంట్ ఆఫీస్ కి వచ్చారు..
చిన్న స్టార్ట్ అప్ కంపెనీ గా పెట్టినా,
చిన్న చిన్న ఈవెంట్స్ తో మొదలైన వాళ్లు ఇప్పుడు ఇపుడే కొంచెం పెద్ద తరహా ఈవెంట్స్ చేస్తున్నారు.
కొంత మంది వర్కర్స్ ఉండే తమ ఆఫీస్ ను ఈసీ గానే హ్యాండిల్ చేస్తూన్నారు ఇద్దరు కలిసి.
కేటరింగ్, డెకరేషన్ అండ్ క్లీయింగ్ పర్పస్ కి వర్కర్స్ ను నియమించి మిగతా మేనేజ్మెంట్ నేహా , శుక్ల నే చూసుకుంటున్నారు..
Swipe left/right or tap the sides to turn pages