New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మై డియర్ బీస్ట్ ❤️‍🔥 – 4

మై డియర్ బీస్ట్ ❤️‍🔥 – 4

వర్మ’s కంపెనీ 

 

మీటింగ్ హల్ అంత హడావుడి గా ఉంది..

 

సీఈఓ సార్ వస్తారు అన్ని ఫైల్ చెక్ చేసుకుంటున్నారు..

చిన్న మిస్టేక్ ఉన్న అసలు వదిలి పెట్టడు..ఆఫీస్ వర్క్ విషయం లో చండశాసనుడు.కనుసైగలోతో అవతల వారిని వణికించగలడు. డెడికేటెడ్ అండ్ పర్ఫెక్ట్.

మోడ్రన్ ప్రవరాఖ్యుడు.. చాలా వరకు సైలెంట్ గానే ఉంటాడు అతని నచ్చనది లేదా మోసం జరిగినపుడు అతనిలోని బీస్ట్ బయటికి వస్తాడు..

 

వతైన సిల్కీ hair నుదిటి మీద పడుతుంటే ఒక హ్యాండ్ తో దాని సారీ చేస్తూ,బ్లాక్ సూట్ తో కళ్ళకి గూగుల్స్ పెట్టుకొని ఒక హ్యాండ్ ప్యాంట్ పాకీ లో పెట్టుకొని,

గంభీరం వదనంతో, డిగ్నిటీ ఉట్టి పడే నడకతో అందరి దృష్టి ఆకర్షిస్తూ మీటింగ్ హాల్ లోకి ఎంటర్ అయ్యాడు 

దేవన్ష్ వర్మ…

అమ్మాయిలకి అతని చూస్తేనే హార్ట్ లో బట్టర్ ఫ్లై ఎరుగుతాయి..చూస్తూ ఉండిపోతారు.. బట్ అతను అవేమీ పాటించుకోదు..

 

అతని షోస్ సౌండ్ టక్ టక్ మని వినిపిస్తుంది అంత నిశ్శబ్దం గా ఉంది మీటింగ్ హాల్..

అతను రావడమే అందరూ లేచి నుంచిని విష్ చేశారు . కళ్ళకి ఉన్న గాగుల్స్ తీసి హ్యాండ్ వేవ్ చేశాడు కూర్చోమని..స్టైల్ గా క్రాస్ లెగ్ వేసుకొని మిడిల్ లో ఉన్న చైర్ లో కూర్చున్నాడు..

 

వారి కంపెనీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ గురించి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కొంతసేపు మాట్లాడి మేనేజర్ ముగిస్తే..

 

బడ్జెట్ అండ్ న్యూ టీమ్ ఫర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడక మీటింగ్ ను ముగించాడు దేవాన్ష్..

 

“ఎనీ డౌట్??”

 

నో సార్ అని అందరూ ఒకే  ఆన్సర్ .ఒకరు కూడా మాట్లాడే అవకాశం లేకపోయింది..ఎందుకు అంటే అతను అంత పర్ఫెక్ అండ్ ప్రొఫెషనల్ గా మీటింగ్ హాండిల్ చేశాడు..

 

“ఈసారి మన కంపెనీ ప్రాఫిట్స్ పెరగాలి.అలా అని నాణ్యతను తగ్గించకుండా..కరెక్ట్ బడ్జెట్ లో సరికొత్త నిర్మాణం అందించి.మన కంపెనీ మార్క్ ఉండేలా చూసుకోవాలి” అన్నాడు బేస్ వాయిస్ లో..

“ఒకే సార్ “

మూర్తి గారు కామ్ టూ మై కేబిన్. అని చెప్పి 

దేవాన్ష్ తన క్యాబిన్ లోకి వెళిపోయాడు..

అందరూ ఒకసారిగా రిలాక్స్ అయిపోయారు హమ్మయ్య అనుకుంటూ..

 

మూర్తి గారు వెళ్ళేసరికి దేవాన్ష్ లాప్టాప్ లో ఏదో సీరియస్ వర్క్ చేస్తున్నాడు..

కొన్ని ఫైల్స్ అతని ముందు పెట్టారు సిగ్నేచర్ కోసం.. దేవాన్ష్ రీ చెక్ చేసి సిగ్నేచర్ పెట్టి,తన వర్క్ చేస్తూనే 

 

“మూర్తి గారు బడ్జెట్ ఫైల్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఒకసారి రీ చెక్ చేయండి “అన్నాడు

“ఒకే సార్” అన్నారు మూర్తి..

 

 

మూర్తి గారి గురించి చెప్పాలంటే కొన్ని ఇయర్స్ గా ఆ కంపెనీ లో వర్క్ చేస్తున్న వ్యక్తి..

అందుకే దేవాన్ష్ అతని ప్రొఫెషన్ తో కాకుండా అతని వయసుకి అండ్ అనుభవం మరియు నమ్మకానికి గౌరవం ఇస్తాడు..

 

అతని ప్రతి వర్క్ మూర్తి గారు చూసుకుంటారు..

 

“సార్ ఆఫ్టర్నూన్ 2 కి*******కంపెనీ వాళ్ళతో ***హోటల్ లో మీటింగ్ ఉంది MD sir మిమ్మల్ని అటెండ్ అవ్వమన్నారు” అన్నారు మూర్తి.

 

“ఒకే”

 

 

1 వరకు తన వర్క్ ఫినిష్ చేసుకుని లంచ్ చేసి ****హోటల్ కి మీటింగ్ కి స్టార్ట్ అయ్యాడు అతని కార్ లో..

 

ఒక రిచెస్ట్ ఫైవ్ స్టార్ట్ హోటల్ అది.. పెద్ద పెద్ద బడా బాబులు, బిజినెస్ మాన్స్ వస్తారు అక్కడి.

 

సమయం మధ్యానం 2 గంటలకి

ఒక ప్రైవేట్ క్యాబిన్ లో సీరియస్ గా కొద్ది సేపు డిస్కషన్ జరిగాక డీల్ ఒకే చేశాడు దేవాన్ష్ ..

 

బయటికి రాగానే తండ్రి నుంచి కాల్ .పిక్ చేసి 

“డాడ్ డీల్ ఒకే “అని అన్నాడు..

“ఐ నో నువ్వు ఆ డీల్ ను మనకి వచ్చేలా చేస్తావ్ అని అందుకే నిన్ను పంపించాను..” 

 

“ఈరోజు ఐన త్వరగా ఇంటికి రా దేవా,మీ మామ్ నేను తిడుతూనే ఉంటుంది ..ఈరోజు ఐన నాకు ఆ తిట్ల నుంచి విముక్తి నీ ప్రసాదించు..”

“ఒకే డాడ్”అని చిన్న నవ్వాడు దేవాన్ష్..

 

ఆఫీస్ కి వెళ్ళడానికి కారు ఎక్కి కూర్చున్నాడు దేవా.డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు .. మధ్యలో ట్రాఫిక్ లో అడిగింది కారు అతను ఫోన్ చూస్తునే ఉన్నాడు..

 

పక్కనే ఒక స్కూటీ వచ్చి అడిగింది..దాని మీద ఇద్దరూ అమ్మాయి లు ముఖం కి స్కార్ఫ్ తో ఉన్నారు

పక్క ఆగి ఉనా కారు అద్దం లో చూసుకొని వారి ముచ్చట లో వారు ఉన్నారు.. దేవా తన పనిలో తను ఉండి అవేమీ పట్టించుకోలేదు..

 

దేవాన్ష్ డాడ్ చెప్పినట్టే ఆఫీస్ కి వెళ్ళి త్వరగా వర్క్ పూర్తి చేసుకొని ఇంటికి చేరాడు..

అతని కోసమే వెయిట్ చేస్తునట్టు అతని అమ్మ గారు చిరు నవ్వుతో ఎదురు వచ్చి అతని హత్తుకునారు.