ఇషాంత్ మనసులో మైరా మీద ఉన్న అపారమైన ప్రేమ, ఆమెపై అతనికి ఉన్న పొసెసివ్‌నెస్ అన్నీ ఒక్క క్షణంలో హాల్లో ఉన్న ఆ దృశ్యాన్ని చూసేసరికి మంచులా కరిగిపోయి,
నిప్పు కణికల్లా మారాయి. విజయవాడలో మైరాతో కలిసి హాయిగా, ప్రశాంతంగా, ఎవరికీ తెలియకుండా ఒక సాధారణ జంటలా తిరగాలని ఎన్నో కలలు కన్నా ఇషాంత్,
ఒక్కసారిగా హాల్లో ఉన్న ఆ నలుగురు స్నేహితులను చూసేసరికి లోలోపల భగ్గుమన్నాడు.
ఇషాంత్ తన గది నుండి మైరాతో కలిసి నవ్వుతూ, ఎంతో ఉత్సాహంగా బయటకు అడుగు పెట్టాడు.
మైరా కూడా ఆ లేవండర్ కలర్ చీరలో దేవకన్యలా మెరిసిపోతూ ఇషాంత్ పక్కన నడుస్తోంది.
కానీ, హాల్లో అడుగుపెట్టగానే వాళ్ల ఆనందం ఒక్కసారిగా గాలిలో కలిసిపోయింది.