“అమ్మాయి గారికి ఎవరైనా ఫుడ్ సరిగ్గా తినకపోతే కోపం వస్తుంది రోజా.” అని అన్నాడు తన లంచ్ కంప్లీట్ చేస్తూ శేఖర్.
” అలాగే బాబాయ్.” అని గబగబా తినడం మొదలుపెట్టిన రోజా అనసూయకి కోపం వస్తుంది అని.
“నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా,నువ్వు కూడా వెళ్లి పడుకుంటే కాసేపు పడుకో రోజా.” అని అంది అనసూయ.
“బాబాయ్ ఏదో షాపింగ్ కి వెళ్తాడు అంట కదా.. నేను కూడా అలా బయటకు వెళ్లి వస్తాను అమ్మ.” అని అంది రోజా అనసూయ వైపు చూస్తూ.