New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 56

మై మాఫియా డాన్ – 56

హైదరాబాద్ నగరంలోని ఆ కార్పొరేట్ హాస్పిటల్ కారిడార్లలో నిశ్శబ్దం తాండవిస్తోంది. కానీ ఐసీయూ బయట కూర్చున్న రణ్వీర్ మనసులో మాత్రం ఒక భయంకరమైన సునామీ రగులుతోంది. 

 

అతని తెల్లని షర్టు మీద రోహిత్ రక్తం ఎండిపోయి ముదురు ఎరుపు రంగులోకి మారింది. ఆ రక్తం తడి తన తమ్ముడి ప్రాణాలను గుర్తుచేస్తోంది.

 

డాక్టర్లు బయటకు వచ్చి, మిస్టర్ రణ్వీర్, రోహిత్ గారికి జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ, ఆయన శరీరం నుండి చాలా రక్తం పోయింది. 

 

ఆయనది చాలా అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్. మా బ్లడ్ బ్యాంక్ లో లేదు, సిటీలో ఎక్కడా దొరకట్లేదు. వచ్చే రెండు గంటల్లో రక్తం ఎక్కించకపోతే మేము ఆయన్ని కాపాడుకోలేము అని చేతులెత్తేశారు.

 

రణ్వీర్ కళ్ళలో ఒక్కసారిగా శూన్యం ఆవరించింది సరిగ్గా అప్పుడే రణ్వీర్ కి ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది.

 

గతంలో ఒక బిజినెస్ డీల్ విషయంలో రణ్వీర్ కి అత్యంత సన్నిహితుడైన విక్రమ్ (ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కొడుకు) కి కూడా ఇదే బ్లడ్ గ్రూప్ అని గుర్తుంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue