అతని కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమని ఆస్వాదిస్తూ..”చిన్ననాటి స్నేహితులు కలుస్తున్నారు అంటే నా చిన్నతనంలో చేసిన ప్రయాణమే చేయాలి అనిపించింది రా..
అయినా నేనేమీ ఇబ్బంది పడలేదు,బస్సు నార్మల్గానే వెళ్ళింది.” అని సముదాయిస్తూ ఉంది వీడియో కాల్ లో ఉన్న కొడుకుని ఆ పెద్దావిడ.
“ఈ మొండితనం మాత్రం తగ్గదు నీకు.. చెప్పిన మాట వినమంటే నాకే మాటలు చెబుతూ ఉన్నావ్..” అని గదమాయించాడు ఆ పెద్ద ఆవిడ కొడుకు.
“సరేలే అదంతా మనకి ఎప్పుడూ ఉండేదే కానీ నా కోడలు ఏం చేస్తుంది.” అని అడిగింది ఆ పెద్దావిడ.