మేము బండ్లో వస్తూ ఉంటే ఆయన గారు కార్లో వచ్చేసారు అయ్యో ముందే తెలిసి ఉంటే పిల్లల్ని కూడా తీసుకువచ్చే వాళ్ళం కదా.
వాళ్లెప్పుడూ టౌన్ కి వెళ్ళాలి మాల్ లో తిరగాలి అని ఆశపడ్డారు కానీ పెదనాన్న మావయ్య లకు టైం లేదు కదా బావకి అయితే అంతకంటే లేదు ఏదో ఈరోజు సండే కాబట్టి ఇలా వచ్చాడు అనుకుంటూ నేను మా పిల్లల కోసం బెంగ పెట్టుకుంటూ ఉండగానే,
ఏం ఆలోచిస్తున్నావే లోపలికి రాకుండా అని వదిన కసిరేసరికి ఏం లేదు పదా అనగానే సిద్దు బావ ఇంకేముంది మధ్యాహ్నం వంటకి ఎవరేం చేసుంటారు అందరు తిన్నారా లేదో అని దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది నాకు డౌటే అని అనగానే మూతి తిప్పుకొని అంత సీన్ లేదులే పద అయినా ఏంటి ఇప్పుడు సడన్గా టౌన్ కి అని నేను అడుగుతుంటే లేదే మూవీ చూడాలనిపించింది అని అంది వదిన.
మా రాక్షసి లేచిందే పరుగు అన్నట్లు ఏది అనుకుంటే అది జరిగి తీరాల్సిందే లేదంటే అడుగుతుంది అలిగితే ఇక ఎవరొచ్చినా కూడా ఆలకపాన్పు దిగదు అందుకే సిద్దు బావ కూడా కామ్ అయి మూవీ కి తీసుకొచ్చినట్లు ఉన్నాడు మరి వీరిద్దరు అంటే ఓకే ఆయన గారు ఎందుకు వచ్చారు అని నేను ఆలోచిస్తూ ఉంటే సిద్దు రుద్ర అన్నయ్య ఎక్కడ అని వదిన బావను అడగడం ఆయన గారు వచ్చి మా పక్కనే నిలుచడం వెంటనే జరిగిపోతే టికెట్స్ బుక్ చేశాను వెళ్దాం రండి అని వాచ్ చూసుకుంటూ చెప్పారు.
ఓహో మూవీ చూడటానికి అనుకుంటూ అది చిన్న టౌన్ నే కాబట్టి ఒక చిన్ని మాల్ ఉంది అందులో మల్టీప్లెక్స్ కూడా ఉంది ఏం మూవీ అని నేను చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తున్నాను లోపలికి వెళ్లి కూర్చున్నాక.
అందరం వరుసగా నే కదా వెళ్ళాము నా పక్కన వదిన ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ పక్కకి తిరిగి చూడలేదు అంతలో ఒక బ్లాక్ బంగ్లా ను ఏదో సరౌండింగ్ దానిమీద ఈశా అన్న పేరు కనపడింది ఓ సినిమా పేరు ఇషానా అని అనుకుంటూ ఈషా స్టాచు అంటే నా శివయ్యదే అంటే ఇది కూడా శివుడి మూవీ అయ్యుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ దండం పెట్టేసుకుంటున్నాను మనసులోనే అంతలోనే భూమ్ అన్న సౌండ్ ఇంకెక్కడ నేను పక్కనున్న మనిషి డొక్కలోకి దూరిపోయాను.