రన్వీర్ ఇక అన్వికకి దూరం ఉండలేక అన్విక ను దగ్గర తీసుకుంటూ పైనుంచి కింద వరకు అన్వికాను చూస్తూ ఉంటాడు.
అతని చూపుల బాణాలు ఆమె మదిని తాకుతుంటే ఆమె మధ్యలో గుబులు మొదలవుతుంది.
చాలా అందంగా ఉన్నావ్ అన్విక అని చెప్పి ఇక ఆగలేక అన్విక చెక్కిళ్ళు మీద ఈ చిరుముద్దులు ఇస్తాడు రన్వీర్, రన్వీర్ ని చూడాలని ఉన్న తెలియని బెరుకుతనంతో భయపడుతుంటే,
ఆమె గడ్డాన్ని పట్టుకుని పైకి పెడుతూ ఆమె ముఖాన్ని చూస్తున్నాడు.ఆమె ముఖంలోని సిగ్గుతో మరింత ఎర్రని సింధూరంలో మారడంతో రన్వీర్ కి అన్విక ఇంకా అందంగా కనిపిస్తుంది…..
ఆమెను ఎత్తుకొని బెడ్ పై పడుకోబెట్టాడు.అన్వితకి భయం తారాస్థాయికి చేరడంతో డోర్ క్లోజ్ చేసి ఏసి ఆన్ చేసి లైట్ ఆఫ్ చేస్తాడు…
ఏసీ లోంచి వస్తున్న చల్లగాలి కి అన్విక ఇంకా ముడుచుకుపోతుంటే రన్వీర్ గారు ప్లీజ్ భయపెట్టకండి అని వణుకుతున్న గొంతుతో అంటుంది…