New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మౌనం వీడవే సఖి 💝 – 4

మౌనం వీడవే సఖి 💝 – 4

వికృత్ 💘 అభిజ్ఞా

అభిజ్ఞా నీ ఇప్పటి నుంచి అభి అని పిలుచుకుందం…

 

వికృత్ నీ విక్కీ అని పిలుచ్చుకుందాం…….

 

అభి మిద కోపంతో విక్కీ  బార్ కి వెళ్లి ఫుల్ గా తాగి పడిపోతే అతని ఫ్రెండ్స్ మాధవ్ అండ్ సాగర్ అతన్ని ఇంటికి తీసుకొని వెళ్తారు….

……………..

నీ కోసమే నేను నీకు దూరం అవ్వాలి అనుకున్నాను…. నా గురించి నా గతం గురించి తెలిస్తే నా మిద కనీసం ఈ కోపం , అసహ్యం అనే ఫీలింగ్స్ కూడా ఉండవు  నీకు  అని బాధగా అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అభి….

అప్పుడే కింద మాధవ్ అండ్ సాగర్ ఇద్దరు కలిసి విక్కీ నీ చెరో రెక్క పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వస్తారు…హాల్ లోనే ఉన్న విక్కీ పెద్ద చెల్లి కార్తీక కంగారుగా మాధవ్ వాళ్ళకి ఎదురు వెళ్లి ” ఏం అయ్యింది అన్నయ్య కి ” అని అడిగింది….

 

” హా ఫుల్ గా తాగి పాడిపోయాడు ఇడియట్ ” అని కోపంగా  కార్తీక కి చెప్పి అక్కడ నుంచి విక్కీ రూం పైన ఉండడంతో అక్కడికి తీసుకొని వెళ్తారు ఇద్దరు….

కార్తీక వెళ్లి ఆ విషయం జానకి  , రఘు రాం గారి వాళ్ళకి చెప్తుంది…. ఆ మాట వినగానే వాళ్ళు షాక్ అయ్యారు ఎందుకు అంటే విక్కీ కి మందు అలవాటు లేదు…తాగే వాళ్ళు అన్నా కూడా అతనికి అసహ్యం.

అలాంటిది  ఇప్పుడు అతనే ఒళ్ళు మరిచిపోయేంత తాగి నడవలేక స్పృహ తప్పి పోయే స్టేజ్ లో తాగి వచ్చాడు అని తెలిసే సరికి అతను ఎంత బాధపడుతూ ఉన్నారో అర్థం చేసుకొని …..అసలు అతని బాధకి కారణం అయిన వాళ్ళ మిద కోపం వస్తూ ఉంటే బాధగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు జానకి , రఘు రాం గారు….

………………….

గదిలో కూర్చొని గోడకు ఆనుకొని  విక్కీ మాటలకు ఏడుస్తూ ఉన్న అభి కి సడెన్ గా డోర్ ఓపెన్ అయిన సౌండ్ అండ్ షు సౌండ్ వినిపించడంతో తల ఎత్తి డోర్ వైపు చూసింది.

 

 

అప్పుడే మాధవ్ అండ్ సాగర్ విక్కీ నీ లోపలికి తీసుకొని వచ్చి బెడ్ మిద పడుకో బెడుతూ చిందర వందరగా ఉన్న రూం నీ చూసి ఏదో జరిగింది సం తింగ్ ఈస్ రాంగ్ అని అనుకుంటూ ఉంటారు.

అప్పుడే అక్కడ గోడకు ఆనుకొని ఉన్న అభి కంగారుగా బెడ్ దగ్గరికి వచ్చి మాధవ్ అన్నయ్య ఆయనికి ఏం అయ్యింది ” అని అడిగింది బెడ్ మిద స్పృహ లేకుండా పడి ఉన్న విక్కీ నీ చూస్తూ…

అభి తను పరిచయం ఉన్నట్టు పేరు తో పలకరిస్తూ ఉంటే మాధవ్ తననే షాకింగ్ గా చూస్తూ ఉంటాడు….అన్నయ్య మిమల్నే ఆయనకి ఏం అయ్యింది ” అని మళ్ళీ అడిగింది.

అసలు నువ్వు ఇక్కడ ఉన్నావు ఎంటి…?? నువ్వు అక్షర వాళ్ళ చెల్లి కదా…?? అసలు నువ్వు విక్కీ రూంలో ఉన్నావు ఎంటి…? అని అడుగుతూ పైనే పచ్చగా మెరిసిపోతూ కనిపిస్తున్న తాళి అభి మెడలో చూడగానే షాక్ అవుతు ” నికు ఎప్పుడు పెళ్లి జరిగింది.

 

మార్నింగ్ వరకు కూడా నువ్వు మామూలుగానే ఉన్నావు కదా…? ఇప్పుడు ఎంటి నీ మెడలో తాళి ఉంది…? అంటే నీకు పెళ్లి అయ్యిందా…? అని అడిగాడు మాధవ్..

 

 

( అక్షర , విక్కీ పెళ్ళిలో అభి నీ చూశారు మాధవ్ అండ్ సాగర్ కానీ విక్కీ మళ్ళీ అభి నీ పెళ్లి చేసుకున్నాడు అనే విషయం వాళ్ళకి తెలియదు…వాళ్ళు ఇద్దరు అక్షర , విక్కీ పెళ్లి అవ్వగానే ఆఫీసు లో అర్జంట్ మీటింగ్ ఉంది ఆఫీసు కి వెళ్ళిపోయారు)

 

 

మాధవ్ అడిగిన ప్రశ్నలకు అభి ఏం సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటే అప్పుడే లోపలికి వచ్చిన కార్తీక మాట్లాడుతూ ” విక్కీ అన్నయ్య మళ్ళీ ఈ అమ్మాయి నీ కూడా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు…..అసలు అన్నయ్య ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయే అని డౌట్….” అని చెప్పింది సాగర్ పక్కన నిలబడి….

 

ఆ మాట వినగానే సాగర్ అండ్ మాధవ్ కి మైండ్ బ్లాక్ అయ్యింది….ఎంటి…? విక్కీ మళ్ళీ ఈ అమ్మాయి నీ పెళ్లి చేసుకున్నాడా…? ఎప్పుడు ? అని అడిగాడు మాధవ్…

 

 

ఏమో తెలియదు ఈవెనింగ్ ఈ అమ్మాయి నీ పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చి ఈ రూంలోనే వదిలేసి పోయాడు….వాళ్ళు ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు వింటే అర్ధం అయ్యింది అన్నయ్య ప్రేమించింది అక్షర వదినని కాదు తినని అంటూ అభి నీ చూపించింది….

 

 

కార్తీక చెప్పిన విషయాన్ని బట్టి మాధవ్ కి , సాగర్ వాళ్ళకి ఉన్న డౌట్స్ లో కొన్నిటికి ఆన్సర్ దొరికింది…విక్కీ లవ్ చేసింది అభి నీ కాబట్టే వాళ్ళని గుర్తు పట్టి అన్నయ్య అని పిలిచింది అని…..

అలాగే అసలు విక్కీ ప్రేమించిన అభి నీ కాకుండా వాళ్ళ అక్క అక్షర నీ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు…?అక్క నీ పెళ్లి చేసుకున్నాడు సరే మరి ఇప్పుడు చెల్లిని కూడా ఎందుకు చేసుకున్నాడు…?

 

ఇలా ఇంకా చాల ప్రశ్నలు అలాగే వాళ్ళ బ్రెయిన్ లో తిరుగుతూ వుండగానే అభి ఏడుస్తూ విక్కీ దగ్గరికి వెళ్లి అతని నుంచి వస్తున్న ఆల్కహాల్ స్మెల్ బట్టి డ్రింక్ చేశాడు అని అర్థం అయ్యి సైలెంట్ గా ఏడుస్తూ……అతని కాళ్ళకి ఉన్న షూ తీసి అతన్ని ,  కరెక్ట్ గా బెడ్ మిద అడ్జస్ట్ చేసి , అతనికి బెడ్ షీట్ కప్పుతూ  ఉంటుంది.

అభి చేస్తుంది చూస్తున్న మాధవ్ , సాగర్ , కార్తీక ముగ్గురు ఒకసారి ఇద్దరినీ చూసి ఇంకా అక్కడ ఉంటే బాగోదు అని బయటికి వెళ్ళిపోతారు.

వాళ్ళు అలా బయటికి వెళ్ళగానే అభి బెడ్ మిద కూర్చొని విక్కీ తల నీ తన ఒడిలో పెట్టుకొని అతని తల నిమురుతూ ” ఎందుకు యాంగ్రీ బర్డ్ నా మిద కోపం తో నీ హెల్త్ పాడు చేసుకుంటున్నావు…. నీకు కోపం ఉంటే అది నా మిద చూపించు కానీ ఇలా నిన్ను నువ్వు పనిష్ చేసుకోకు ప్లీస్….అని ఏడుస్తూ మెల్లిగా ముందుకి వంగి విక్కీ ఫోర్ హెడ్ మిద కిస్ చేసి అలాగే అతన్ని గుండెకి హత్తుకొని ఏడుస్తూ పడుకుండి పోతుంది.

కింద రూంలో ఉన్న అక్షర కూడా ఏడుస్తూ ఏడుస్తూ అలాగే నేల మిద పడుకుంటుంది.

మాధవ వాళ్ళు కిందకి వచ్చే సరికి అక్కడ జానకి రఘు రాం గారు బాధగా సోఫాలో కూర్చొని ఉంటే ముగ్గురు నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు.

ఆ రోజు ఉదయం పెళ్లి హడావుడితో కళకళలాడిన ఇల్లు ఇప్పుడు బోసి పోయింది…ఎవరి మొహంలోనూ నవ్వు అనే మాట లేదు…అసలు అది పెళ్లి జరిగిన ఇల్యులానే లేదు…ఎటు చూసినా నిశ్శబ్దం ఆవరించింది…అందరి మొహాల్లోనూ బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

 

ఇప్పటికీ అందరికీ అర్థం కాని విషయం ఒక్కటే అసలు విక్కీ ఎంటి ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకోవడం ఎంటి…? ఇదే ప్రశ్న అందరి మనసుల్లో ఉంది.

మాధవ్ , సాగర్ వెళ్లి జానికీ గారు వాళ్ళ పక్కన కూర్చొని అసలు ఏం జరిగింది ఆంటీ….? మన విక్కీ గాడు ఎంటి ఇలా అయిపోయాడు అసలు…వాడే కదా వాడు ప్రేమించింది అక్షర నీ అని చెప్పి మన అందరినీ ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాడు… మరి ఇప్పుడు ఎంటి ఇది అంతా….? అని అడుగుతాడు.

జానకి గారు ఏదో మాట్లబోతు ఉండగా విక్కీ రెండో చెల్లి మహిత శ్రీ కంగారుగా మమ్మీ , డాడీ అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది……

మహిత ఎందుకు కంగారు పడుతుంది…?

 

To be continued…..