New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మౌనం వీడవే సఖి 💝 – 5

మౌనం వీడవే సఖి 💝 – 5

      వికృత్ 💘 అభిజ్ఞా

మాధవ్ , సాగర్ వెళ్లి జానికీ గారు వాళ్ళ పక్కన కూర్చొని అసలు ఏం జరిగింది ఆంటీ….? మన విక్కీ గాడు ఎంటి ఇలా అయిపోయాడు అసలు…వాడే కదా వాడు ప్రేమించింది అక్షర నీ అని చెప్పి మన అందరినీ ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాడు… మరి ఇప్పుడు ఎంటి ఇది అంతా….? అని అడుగుతాడు.

జానకి గారు ఏదో మాట్లబోతు ఉండగా విక్కీ రెండో చెల్లి మహిత శ్రీ కంగారుగా మమ్మీ , డాడీ అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది.

 

ఏమయింది ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని అడిగాడు మాధవ్…

 

అది అది రూం లో ఉన్న నాన్నమ్మ కి నానమ్మ కి అంటూ ఒక రూం వైపు చెయ్యి చూపిస్తూ “నానమ్మ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది” గుండె పట్టుకొని నొప్పి అంటూ ఉంది….అని చెప్పింది…


అది విని అందరు ఇంకా ఆవిడ రూంలోకి పరుగు పెట్టారు….మాధవ్ వెంటనే బెడ్ మిద పడుకొని నొప్పికి విలవిలాడిపోతున్న  విక్కీ నానమ్మ చాముండి గారిని రెండు చేతులతో ఎత్తుకొని బయటికి తీసుకొని వెళ్తాడు..

 

మాధవ్ వెనకే జానకి గారు రఘు గారు మిగిలిన ఫ్యామిలీ మెంబెర్స్ అందరు వెళ్తారు….

 

అప్పటికి టైం రాత్రి 10 గంటలు దాటడంతో రోడ్డు కొంచం కాళి గా ఉండడంతో అరగంటలో చాముండి వాటిని దగ్గర్లో ఉన్న హాస్పటల్ లో జాయిన్ చేస్తారు….అందరు icu రూం బయట చైర్ లో బాధగా కూర్చొని ఉంటారు…

 

విక్కీ , అక్షర , అభి వీళ్ళ ముగ్గురు తప్పా ఇంకా విక్కీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరు హాస్పటల్ లోనే ఉన్నారు….

 

విక్కీ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ;

విక్కీ నాన్న – రఘు రాం
అమ్మ – జానకి
చెల్లెలు – కార్తీక , మహిత శ్రీ
నానమ్మ – చాముండి

 

విక్కీ ఫ్రెండ్స్ ;

మాధవ్ అండ్ సాగర్

 

ఫ్యామిలీ మెంబెర్స్ అందరు చాముండి గారి గురించి ఆలోచిస్తూ బాధగా హాస్పటల్ లో కూర్చొని ఉంటే మాధవ్ మాత్రం విక్కీ , అక్షర , అభి గురించి ఆలోచిస్తూ ఉంటాడు…

………………..

ఇంటి దగ్గర ఉన్న అభి తన ఒడిలో ఉన్న విక్కీ తల నిమురుతూ అతనితో ఏదో మాట్లాడుతూ ఉంటుంది..

 

నేను నిన్ను మొదటి చూపులోనే ఇష్టపడ్డను యాంగ్రీ బర్డ్ కానీ అప్పుడు నాకు అది తెలియలేదు….నువ్వు ఒకసారి కాలేజ్ యానివర్సరీ పార్టీ కోసం అని మీ కాలేజ్ కి వచ్చావు కదా….నేను కూడా అదే కాలేజ్ లో చదివాను…

 

ఆ రోజు ఎవరో నలుగురు అబ్బాయి నన్ను బలవంతం చెయ్యబోతే కరెక్ట్ టైం కి నువ్వు వచ్చి నన్ను సేవ్ చేసి వాళ్ళని మళ్ళీ పైకి లేవకుండా తుక్కు తుక్కు గా కొట్టవ కదా…..

 

ఆ రోజు రియలైజ్ అయ్యాను నువ్వు అంటే నాకు ఇష్టం అని , నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని….. ఆ క్షణం నా మనసు ఎన్ని కేరింతలు కొట్టింది తెలుసా…

 

కానీ మళ్ళీ వెంటనే నువ్వు మా కాలేజ్ ఛైర్మెన్ గారి అబ్బాయి అని అంతే కాకుండా టాప్ వన్ బిజినెస్ మ్యాన్ లో ఒకడివి అని తెలిసి నిన్ను ప్రేమిస్తున్న అని చెప్తే నీ డబ్బు కోసం నిన్ను ప్రీమించా అనుకుంటావ్ అని నా మనసులోనే నా ప్రేమ నీ సమాధి చేయకున్నా….

 

 

కానీ మళ్ళీ మళ్ళీ నువ్వు నా కంట కనపడుతూ ఉంటే నిన్ను ప్రేమించకుండ ఉండలేక రోజు చాల ఇబ్బంది పడేదాన్ని.

ఒక రోజు నువ్వు లవ్ మిద నీకు ఉన్న అభిప్రాయం చెప్తూ ప్రేమకి ధైర్యం ఉండాలి ఎవరో ఏదో అనుకుంటాడు అని ప్రేమ నీ మనసులోనే డాచుకోకూడదు అని చెప్పిన మాటలు వల్ల ఇంకా ధైర్యం చేసి నీ ఫోన్ నెంబర్ మా ప్రిన్సిపాల్ సార్ ఫోన్ లో నుంచి కొట్టేసి నీకు మెసేజ్ చేశా..

అలా నీతో పరిచయం పెంచుకుని మెల్లిగా నా మాటలతో నీకు దగ్గర అయ్యాను……నువ్వు మొదట్లో నా మిద కొప్పడిన కూడా తరవాత నువ్వు కూడా నాకు దగ్గర అయ్యి నువ్వే నాకు ప్రపోజ్ చేసావు..

ఆ రోజు నేను నిజంగా భూమి మిద లెను ఏమో అని అనిపించింది…..నేను ప్రేమించిన వాడు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని వాడి మాటల్లో వింటున్నప్పుడు వచ్చే ఆనందం ఎంత బాగుంటుంది ఆ రోజు నాకు అర్థం అయ్యింది.

 

నువ్వు అలా ప్రపోజ్ చేసిన వెంటనే నేను కూడా నా మనసు మాట దాచుకోలేక నీకు చెప్పేశా…..అలా మొదలు అయిన మన ప్రేమ కథ రోజుకి ఒక అలక , గొడవ తో చాల సంతోషంగా సాగిపోయింది.

మన పెళ్లి చూపులలోనే నువ్వు నన్ను మొదటి సారి చూస్తా అని చెప్పి పెళ్లి చూపులకి మా ఇంటికి వస్తాను చెప్పిన రెండు రోజుల ముందు….

 

నాకు ఒక భయకరం అయిన నిజం తెలిసింది… ఆ నిజం వినగానే నా ప్రాణం అక్కడే ఆగిపోతే బాగుండు అని అనిపించింది…

ఇంతకీ అసలు అభి కి తెలిసిన ఆ నిజం ఎంటి…?

 

అభికి తెలిసిన నిజానికి తను విక్కీ కి దూరం అవ్వడానికి సంబంధం ఎంటి…?

 

To be continued…..

 

స్టోరీ ఎలా అనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పండి…