New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనం వీడవే సఖి 💝 – 8

మౌనం వీడవే సఖి 💝 – 8

చిన్న వదిన ( అభి ) అన్నయ్య నీ మోసం చేసింది అంట….అందుకే అన్నయ్య ఆ మోసాన్ని భరించలేక చిన్న వదినకి బుద్ధి చెప్పాలి అని తనని కూడా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు ” అని చెప్పింది మహిత..

అలా వాళ్ళ మాటల్లోనే ఇంటికి చేరుకుని కార్ పార్క్ చేసి ఇంట్లోకి అడుగు పెట్టీ ఎదురుగా ఉన్న దృశ్యం చూసి నలుగురు షాక్ తో ఫ్రేస్ అయిపోతారు….

హాల్ మొత్తం  రకరకాల టిఫిన్ అండ్ చట్నీ లతో చిందర వందరగా చూడడానికి చిరాకుగా ఉండేలా ఉంది….

ఒక పక్కన అభి కింద ఫ్లోర్ మిద పడి ఉన్న చట్నీ లు అన్నీ క్లీన్ చేస్తూ ఉంటే మరో పక్క అక్షర ఫ్లోర్ మిద ఉన్న టిఫిన్ ( ఇడ్లీ , వడ) అవి తీస్తూ ఉంది…

ఆ దృశ్యం చూసిన నలుగురు గుమ్మం దగ్గర షాక్ తో నిలబడి పోతే ముందుగా తేరుకున్న మాధవ్ అక్కడే సోఫాలో కూర్చొని తీరికగా పేపర్ చదువుతూ ఉన్న విక్కీ నీ చూసి ” రేయ్ విక్కీ ఇప్పుడు నీకు ఎలా ఉంది…? అసలు ఇల్లు అంతా ఎంటి ఇలా ఉంది…? అని అడుగుతూ విక్కీ దగ్గరికి వెళ్తాడు..

విక్కీ దగ్గరికి వెళ్తున్న మాధవ్ చూసుకోకుండా అల్లం చట్నీ మిద కాలు వేసి జారి పడబోతూ ఉంటే ” అన్నయ్య జాగ్రత్త ” అంటూ అభి అతన్ని పడకుండా హ్యాండ్ పట్టుకుంది…

మాధవ్ బ్యాలెన్స్ చేస్కొని కింద పడకుండా నిలబడి తనకి హెల్ప్ చేసిన అభి నీ చూసి థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పి అక్కడ నుంచి విక్కీ దగ్గరికి వెళ్తాడు…

అభి అలా మాధవ్ కి హెల్ప్ చెయ్యడం విక్కీ కి నచ్చలేదు…అంటే అభి మాధవ్ చెయ్యి పట్టుకుంది కదా అక్కడ బాబు గారికి బాగ మండింది సో అందుకే సోఫాలో నుంచి లేచి కోపంగా అభి దగ్గరికి వెళ్లి తనని చూస్తే ఆ పక్కనే ఉన్న అక్షర నీ లాగి పెట్టీ ఒక్కటి పీకాడు…

విక్కీ కొట్టిన దెబ్బకు అక్షర కళ్ళు బైర్లు కమ్మాతూ ఉంటే….ఒక్క అడుగు వెనక్కి వేసి కింద పడకుండా నిలదొక్కుకుని….చెంప మిద చెయ్యి పెట్టుకొని కళ్ళలో నీళ్ళతో విక్కీ నీ చూసింది…

అభి కోపంగా తన దగ్గరికి వచ్చే సరికి తనని ఏం అయిన చేస్తాడు అని అనుకున్న అభి కాస్తా అలా అక్షర నీ కొట్టే సరికి షాక్ తో అలా చూస్తూ ఉండిపోతుంది…

” రేయ్ విక్కీ నీకు ఏం అయిన పిచ్చా…ఇప్పుడు ఎందుకు అక్షర గారిని కొట్టవు ” అని అడిగాడు మాధవ్…

ఇంకోక్కసారి నేను చెప్పిన పని చెయ్యకుండా ఎక్స్ట్రలు చేస్తే ఇలానే ఉంటుంది..” అని చెప్పి పది నిమిషాల్లో  వస్తా ఇల్లు అంతా క్లీన్ గా ఉండాలి లేదు అంటే…..” అని పైన ఉన్న తన రూంకి వెళ్ళిపోయాడు విక్కీ…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue