నాన్న నీకు కవిత్వం అంటే ఇష్టం కదా, నీ కూతురు రాసిన ఈ మాటలు బాగున్నాయని ఒక్కసారి నా కలల్లోకి వచ్చి చెప్పవా….
వంశీ ఆ అక్షరాలను చదువుతుంటే అతని కళ్లు నీళ్లతో నిండిపోయాయి. ఆ డైరీ పేజీ మీద ఆమె చిన్నప్పుడు పెన్నుతో వేసిన బుజ్జి బుజ్జి బొమ్మలు,
ఆమె వేదన చూస్తుంటే వంశీకి ఆమెను ఇప్పుడే వెళ్లి గట్టిగా హత్తుకుని నేనున్నాను నీకు తోడుగా అని చెప్పాలనిపించింది.
ఎంతటి ధైర్యం నీది, లోకం నిన్ను చూసి నవ్వినా, నువ్వు లోకాన్ని చూసి నవ్వుతావా. నీ అక్షరాలు బాగున్నాయని మీ అమ్మ నాన్నలు చెప్పారో లేదో కానీ,
ఈ వంశీ మాత్రం నీ అక్షరాలకు బానిస అయిపోయాడు అని అతను తనలో తానే అనుకున్నాడు.వంశీ ఆ డైరీలోని కవిత్వాన్ని చదివి నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
ఆ చిన్నారి శ్రావణి తన తల్లిదండ్రులను అడిగిన ఆ ప్రశ్న నా కవిత్వం బాగుందా నాన్న వంశీ గుండెల్లో ఒక తీపి గాయంలా తగిలింది.