New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనమే ని భాష – 20

మౌనమే ని భాష – 20

వర్షం వెలిసినా, ఆ రాత్రి గాలిలో ఉన్న చలి శ్రావణి మనసును వణికిస్తోంది.

 

స్నేహ సాయంతో కొత్త రూమ్‌కి చేరుకున్న శ్రావణికి, తన ప్రాణాన్ని కాపాడిన ఆ అపరిచితుడి గురించే ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతున్నాయి.

 

తలకి ఉన్న గాయం కంటే, తనని ఆ స్థితిలో చూసి కూడా ఏమీ ఆశించకుండా వెళ్ళిపోయిన ఆ వ్యక్తి మంచితనం ఆమెను ఆశ్చర్యపరిచింది.

 

ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉంటారా? అని ఆమె తనలో తాను ప్రశ్నించుకుంది. ఆ అబ్బాయి ముఖం కూడా చూడలేకపోయానన్న వెలితి ఆమెను వేధిస్తోంది. 

 

తను పడుతున్న కష్టాల మధ్య, ఆ దేవుడు పంపిన ఒక దూతలా అతన్ని భావించింది. నీరసంగా ఉన్నా, తన కొత్త డైరీ తీసి ఆ అపరిచితుడి కోసం ఈ నాలుగు లైన్లు రాసుకుంది:

 

గుర్తు తెలియని నీడవు నీవు.. ప్రాణం పోసిన దైవానివి!

ప్రతిఫలం కోరని మంచితనానివి.. నిశ్శబ్దంగా వెలిగిన దీపానివి!

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue