రాక్షస ప్రేమ -26
అలా ఇంకొక లైట్ బ్లూ కలర్ సారీ విరాజిత కి నచ్చింది తీసుకున్నారు. వాటి రేట్లు చూసిన కరకధర “ఇవెంటీ ఇంత చీప్లో తీసుకుంటున్నారు మా అత్తయ్య గాని ఇవి చూసింది అంటే మీ మొఖానే కొడుతుంది. మా రేంజ్ కి తగ్గట్టు తీసుకోవాలి” అని అన్నది కనకధారా.
“అయ్యో అత్తయ్య గారు ఇప్పటికీ కూడా మీరు మీ అత్తయ్యకి భయపడతారా..? అయ్యో మీకు కోడలు వస్తున్నా కూడా ఇంకా మీరు మీ అత్తయ్య మాటే వింటున్నారా..?” అని సాగదీస్తూ అడిగింది శౌర్య..
ఇలా అడిగితే కచ్చితంగా నేను మా అత్తయ్య మాట వినను నాకు నచ్చింది చేస్తాను అనే సమాధానం కనకధార నుంచి వస్తుంది అని శౌర్య ఎక్స్పెక్ట్ చేసింది. తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే కనకధారా కూడా అన్నది.
“ఇంకా ఎందుకు అత్తయ్య గారు మా అత్తయ్యకు తెలిస్తే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని భయపడుతూ మాట్లాడతారు. మీరు స్వతంత్రంగా ఉండండి స్వతంత్రంగా మాట్లాడండి మీ కోడలికి ఈ చీర బాగుంటుంది కదా” అని తన మాటలతో కనకధారని మన్యూప్లేట్ చేసి వాళ్ళు తీసుకున్న చీరలు బాగున్నాయి అని చెప్పింది.