రాక్షస ప్రేమ -29
శౌర్య నవ్వుతూ సరే అత్తయ్య అంటూ తను ఒక్కటి వెళితే మరల రౌద్ర తన దగ్గరకు వస్తాడు ఏమో అనే భయంతో అపర్ణ చేతిని పట్టుకొని రూమ్ లోనికి తీసుకొని వెళ్ళింది.
“ఏంటే నన్ను కూడా నీతో పాటు నాకు వెళుతున్నావ్..?” అని శౌర్య బిహేవియర్ తనకి కొత్తగా అనిపించడంతో అడిగింది అపర్ణ..
అది అంటూ రౌద్ర వైపు ఒక్క క్షణం తిరిగి చూసి “ఏం లేదులే రా వెళ్దాం” అని అపర్ణని తీసుకొని వెళ్ళింది. శౌర్య చూపుని గమనించిన అపర్ణ నవ్వకంటూ అర్థమయిందిలే అని అన్నది.
చాల్లే ఏడిపించింది అని రూమ్ లోకి వచ్చిన తర్వాత తను బ్యాగ్ ఓపెన్ చేసి చూసి చూసింది. కానీ అందులో బాక్స్ కనిపించలేదు ఏమైంది బాక్స్ కనిపించడం లేదు అని ఆ బ్యాగ్ మొత్తం చూసింది కానీ ఎక్కడ కనిపించలేదు.
“ఏంటే దేనికోసం వెతుకుతున్నావు..!” అని అపర్ణ అయోమయంగా అడిగింది.