New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రావమ్మా.. మహాలక్ష్మి – 7

రావమ్మా.. మహాలక్ష్మి – 7

ఆ రాత్రి.. విష్ణు గదిలోకి నిద్రా దేవత రాలేదు.. బయట కురుస్తున్న వెన్నెల అతడి హృదయం లో మంట ని చల్లార్చలేదు. 

మహా మాటలు అతడి గుండెల్లో గుచ్చుకున్న అవి పచ్చి నిజాలే అన్న వాస్తవం అతడికి తెలుసు. తొలిసారి అతడికి తన మేనత్త దురదృష్టం మీద కోపం వచ్చింది. 

 

అత్త నువ్వలా మావయ్య ని కాదనుకోకుండా ఉండుంటే మహా కూడా అందరి ఆడపిల్లల్లా సంతోషం గా పెరిగి ఉండేది..నా ప్రేమ ఫలించేది. ఎవరికి లేని అదృష్టం ప్రేమించిన అమ్మాయి కళ్ల ముందే ఉండటం.. కానీ ఎవరికి లేని దురదృష్టం కూడా నాదే.. ఎంత దగ్గరలో ఉన్న అంత దూరంగా తను ఉండటం..

 

ఆ పాల సముద్రాన్ని చిలికితే పుట్టిన మహాలక్ష్మి విష్ణువు ని వరించింది.. ఈ కష్టాల సముద్రం లో తాను ఇంకా మునగలేను  అంటూ ఈ మహాలక్ష్మి ఈ విష్ణుని వారించింది. 

 

మహాలక్ష్మి లేని విష్ణు బ్రతుకులో కళ ఉంటుందా..??

 

అతడి మనసు భారంగా మారిపోయింది. 

 

ఆ రాత్రి విష్ణు మనసులో చీకట్లని తొలగించకుండానే వెలుగు రేఖలకి తావిచ్చింది. ఆలోచనల ఆవిరి సమసిపోకుండానే భళ్లున తెల్లారింది. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue