వలయం -6
ఉదయ్ ఏడుస్తూ తన తల్లిని గట్టిగా పట్టుకొని “అమ్మ నన్ను క్షమించమ్మా నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాలేను, నా జీవితాంతం ఇక్కడే ఉంటాను ఇదే నా ఇల్లు ఇదే నా ప్రపంచం” అని కాలిపోయిన ఆ ఇంటిని చూస్తూనే అన్నాడు..
“అలా మాట్లాడతావ్ ఏంట్రా నీకోసమే మేము బ్రతుకుతుంది. నువ్వే ఇలా మాట్లాడితే మా పరిస్థితి ఏంటిరా..?” అని అన్నది ఆదిలక్ష్మి.
ఉదయ్ ఇక ఏమి మాట్లాడలేదు.
ఏమి మాట్లాడినా తనని కన్విన్స్ చేయాలి అని తన తల్లి ప్రయత్నిస్తుంది అని అర్థం చేసుకున్నాడు.
“వాడిని కొన్ని రోజులు అలా ఒంటరిగా వదిలేస్తే వాడే అర్థం చేసుకుంటాడు, భార్య చనిపోయిన బాధలో ఉన్నాడు కదా వదిలేయండి” అని అన్నాడు నారాయణ.
“అలా ఎలా వదిలేస్తాం.. అన్నయ్య” అని లక్ష్మి, ఆదిలక్ష్మి ఒకేసారి అన్నారు.