New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వలయం – 29
వలయం Premium 6 min read

వలయం – 29

వలయం -29

 

 

“నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది కానీ ఆ రోజు నువ్వు ప్రియాంక ఫోన్ చేసింది అని హాస్పిటల్ కి వెళ్లావు. మరి ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు చనిపోయింది ఎవరు? ఆ డెడ్ బాడీ ఎవరిది మీకు తెలియకుండా మీ ఇంట్లోనికి ఎవరు వచ్చే ఛాన్స్ లేదే” అని అడిగింది కల్పన..

 

హ్మ్ అని విరక్తిగా నవ్వుతూ “ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అంటే ఏంటో అనుకున్నాను. కానీ ఇప్పుడే నాకు అర్థమైంది, ఆరోజు గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయింది నేను కాదు, నన్ను చంపి ఎవరిని అయితే పెళ్లి చేసుకొని హ్యాపీగా బ్రతకాలి అనుకుంటున్నాడో ఆ రమ్య” అని అన్నది నిధి..

 

“వాట్ నువ్వే మాట్లాడుతున్నావ్” అని అందరూ ఆశ్చర్యపోయారు.

 

నిధికి రమ్య చాలా రోజుల నుంచి కనిపించడం లేదు ఆమె కోసం ఉదయ్, రమ్య పేరెంట్స్ వెతుకుతున్నారు అనే విషయం తెలియదు కానీ ఆరోజు జరిగిన సిచువేషన్ బట్టి చెప్పింది..

 

 ఉదయ్ అయితే “నువ్వేం మాట్లాడుతున్నావ్ రమ్య చనిపోవడం ఏంటి? ఇన్ని రోజులు కనిపించడం లేదు అని తనని వెతుకుతున్నాం, అంటే ఆ రోజు నువ్వు తప్పించుకునే తనను చంపేస్తావా..? నిజం చెప్పు నువ్వే కావాలి అని రమ్య ని చంపేసావు కదా, ఇన్ని రోజులు తను ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ కు వెళ్ళింది. మిస్సయింది అనుకున్నాం కానీ నువ్వే కావాలి అని ఏదో చేశావు కదా” అని కోపంతో జైలు ఊసలు పట్టుకొని ఊగిపోతు అడిగాడు…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue