వలయం -7
బయట స్నాక్స్ పునుగులు రెండు ప్లేట్స్ చెప్పి “ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా బాగా డెవలప్ అయింది రా, మధ్యలో మాకు మాత్రం బాగానే లాభాలు వస్తున్నాయి. ఫస్ట్ లో ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేస్తే ఏం లాభం వస్తుంది అనుకున్నాను కానీ ఇప్పుడు చాలా లాభాలు వస్తున్నాయి రా. అసలు టైం కూడా దొరకడం లేదు తెలుసా” అని అన్నాడు నీరజ్.
ఉదయ్ నీరజ్ ని ఒక్క క్షణం చూసి సైలెంట్గా పునుగులు తింటూ ఉన్నాడు.
“నాలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా జాయిన్ అవ్వు అంటే, నాకు ఇష్టం లేదు, ఈ రియల్ ఎస్టేట్ ఎప్పుడు డౌన్ అవుతుందో తెలియదు ఎప్పుడు హై లోకి వెళ్తుందో తెలియదు అని అన్నావు.. కానీ ఇప్పుడు చూసావా ఒక్కసారిగా బిజినెస్ టర్న్ అయింది” అని నీరజ్ చెప్తున్నప్పుడే,
తనకి ఫోన్ రావటంతో ఫోన్ లిఫ్ట్ చేసి రెండు నిమిషాలు మాట్లాడాడు
“సరే రా నాకు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది నేను వెళ్తున్నాను నువ్వు ఇంటికి వెళ్ళిపో” అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నీరజ్..
ఉదయ్ వెళుతున్న నీరజ్ వైపు అంతే చూస్తూ ఉన్నాడు. అలా తను స్నాక్స్ తినేసి నడుచుకుంటూ వస్తున్నాడు.