New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వలయం – 28
వలయం Premium 6 min read

వలయం – 28

వలయం -28

 

 

“అది కూడా నిజమే, నిధి కోసం ఈ ఉదయ్ ప్లాన్ చేశాడు కానీ ఆ ప్లాన్ లో మరో అమ్మాయి ఎవరో పాపం బలైపోయింది” అని అన్నాడు రాజేష్.

 

“సార్ ఏం జరిగిందో నాకు క్లారిటీగా తెలియదు, ఒకసారి గ్యాస్ పేలిన తర్వాత ఏం జరిగింది అనేది మీరు నాకు క్లారిటీగా చెప్పగలరా..?” అని నిధి ప్రమోద్ ని అడిగింది..

 

జరిగింది మొత్తం చెప్పాడు ప్రమోద్. 

 

, “నువ్వు ఎలా తప్పించుకున్నావ్? అసలు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లి పోయావు, సుబ్బారావు అనే వ్యక్తి నిన్ను కిడ్నాప్ చేశాడు అని రాజేష్ చెప్తున్నాడు, అదంతా నిజమేనా, అతను నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశాడు. నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం అతనికి ఏంటి..? ఆల్రెడీ ఇక్కడ నువ్వు చనిపోయావు అని అంటున్నా కూడా నువ్వు బ్రతికే ఉన్నావు అనే విషయం అందరికీ ఎందుకు చెప్పలేదు” అని అడిగాడు ప్రమోద్..

 

“చెప్తాను సార్ మొత్తం చెప్తాను ఆ రోజు సండే కావడంతో ఉదయ్ నాకోసం స్పెషల్ చెయ్యి అన్నాడు, నేను కూడా ఓకే అని కిచెన్లోనికి వెళ్లి, దానికి కావలసినవి అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాను. కరెక్ట్ గా గ్యాస్ లైటర్ వెలిగిస్తున్నప్పుడే నా సిస్టర్ నాకు ఫోన్ చేసింది. బహుశా ఆ ఫోన్ కాలే నన్ను ప్రాణాలతో ఇలా నిలబెట్టిందేమో.. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue