New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
విధి కలిపిన బంధం – 13

విధి కలిపిన బంధం – 13

అక్షయ్ అలా అనేసరికి భయం తో చెమటలు పట్టేసాయ్ అంకిత కి…. అక్షయ్ అంకిత నే గమనిస్తూ రెడీ అయ్యి ఉండు బయటకు వెళ్దాం డ్రైవింగ్ నువ్వే చేయాలి అన్నాడు….

 

 

ఇంక అంతే నెత్తిన పిడుగు పడ్డట్టుగా రియాక్షన్ ఇచ్చింది…. అక్షయ్ వెళ్ళగానే ఫోన్ తీసుకొని ఆదర్ష్ కి ఫోన్ చేసింది…. ఆదర్ష్ చూసుకోక ఎత్తలేదు…. ఇంక వెంటనే ఏమి చేయాలో తెలియక కాంటాక్ట్స్ లో అమ్ము అనే పేరు ఉండేసరికి….

 

 

దానికి డయల్ చేసింది…. అమృత ఇంక కట్ ఐపోతుంది అనగా అప్పుడు లిఫ్ట్ చేసింది…. హలో అక్షిత చెప్పు అనింది…. హలో అమృత గారు ఒకసారి మీరు ఆదర్ష్ ఎక్కడ ఉన్నా తీసుకొని నా రూమ్ కి వస్తారా ఇద్దరు అనింది….

 

 

అంకిత ఎందుకో బాగా కంగారుగా ఉన్నట్టు అనిపించి…. హ సరే నేను తీసుకొస్తాను అని చెప్పి కిందకి వెళ్ళింది….

ఆదర్ష్ అన్నపూర్ణ గారితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue