మరి ఆ విషయాన్ని ఎలా ప్రూఫ్ చేయాలి…. చెప్పినా తన చెల్లెలు అలాంటిది అంటే అమ్మ నమ్మదు… మన దగ్గర కూడా ఆధారాలు లేవు కదా అన్నాడు….
చూడు…. అది మీ అమ్మమ్మ చేయించిన నెక్లెస్…. దానికి పెళ్లిలో మీ అమ్మమ్మ వాళ్ళు చేయించిన నగలతో పాటు మీ నాన్నమ్మ వాళ్ళు చేయించిన నగలు కూడా మీ బాబాయ్ అమ్ముకున్నాడు….
ఒక్క బంగారం ముక్కుపుడక కూడా లేదని అందరికీ తెలుసు… కాబట్టి అది స్వతంత్రంగా ఆ నెక్లెస్ వేసుకొని బయట తిరగలేదు….
ఖచ్చితంగా ఇంటి రెంట్ కట్టడానికి కూడా లేదంటే దాని కూతురు కాలేజ్ ఫీజ్ కట్టడానికో నగ తాకట్టు పెట్టాల్సి ఉంటుంది…
వాళ్ల ఊరు బంగారం షాపు లక్ష్మయ్య మన ఊరు బంగారం షాపు రామయ్య కి సొంతం బాబాయ్ కొడకే… నేను వాళ్లకి చెప్పి పెడతాను ఒకవేళ తాకట్టు పెడితే దొరికిపోతుంది అంది…