అతని చేతి స్పర్శకి కదలిక లేదు నాలో అదే ప్రకంపనతో తిరిగి చూసాను నన్ను నా అవతారం చూస్తున్నాడు ఇలా పోతావా అన్నట్టు ఉంది చూపు!
గొంతులో గుటకలు పడుతున్నాయి అరచేతిలో చెమట పట్టింది అతని టచ్ కే ఎందుకిలా అయిపోతున్నానో ? తెలియదు నాకు!
అటు సైడ్ డోర్ ఓపెన్ చేసి దిగాడు సరిగ్గా మేము ఇంతకుముందు కూర్చుని ఐస్ క్రీం తిన్న దగ్గరే నా చున్నీ కనిపించింది దాన్ని తీసుకుని ఆ పాకెట్ అందుకుని వచ్చాడు…!!
అక్కడ వాళ్ళు షాక్ నుంచి తేరుకోలేనట్టు ఉంది అందరూ ఆయన వైపే చూస్తున్నారు !
పాకెట్ నా దుపట్టా నా మొహం మీదకి వేసాడు!?