New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వేచానయ్య నీకోసం 🤍 – 7

వేచానయ్య నీకోసం 🤍 – 7

ఇద్దరు స్కూటీ బాగు చేయించుకుని కాలేజీకి వెళ్లేసరికి ఉదయం 10:00 కావడంతో “దొంగ వెధవ… వీడివల్ల ఈరోజు లేట్” అంటూ గాయత్రి అడ్మిషన్ కంప్లీట్ చేయించి అప్పటికే సగం క్లాస్సెస్ పోవడంతో రేపటి నుంచి వద్దామని చెప్పి ఇద్దరు 12:00 కల్లా మళ్ళీ ఇంటికి రావడంతో “ఏంటే అప్పుడే ఇంటికి వచ్చేసారు” అంది గాయత్రి వాళ్ళ పెద్దమ్మ….

 

రోడ్డుమీద జరిగింది మొత్తం గాయత్రి పూస గుచ్చినట్టుగా చెప్పడంతో కావ్య తల పట్టుకుని “ఒసేయ్ ఎందుకే మొత్తం చెప్పేసావ్?” అనగానే “ఉన్నదే కదా అక్క చెప్పాను” అంది….

 

“ఇంకెందుకే లేటు.. ఎన్ని గంటలకి ఎన్ని నిమిషాలకి యాక్సిడెంట్ అయింది… యాక్సిడెంట్ చేసిన కార్ కలర్ ఏంటి? అందులో నుంచి దిగిన వాడి హైట్ ఏంటి వాడు వేసుకున్న బట్టల కలర్ ఏంటి? ఇవన్నీ చెప్పు లేట్ ఎందుకు” అంది కావ్య వెటకారంగా…..

 

గాయత్రి మూతి ముడుచుకోవడంతో “దాన్ని ఎందుకే తిడుతున్నావ్?” అని కోపంగా చూస్తూ “మీకేమైనా దెబ్బలు తగిలాయా?” అని కంగారుగా అడగడంతో “లైట్గా చేతిలో మోకాళ్లు గీసుకుపోయాయి” అని చెప్పడంతో “ఆయింట్మెంట్ పెడతాను రండి” అంటూ ఇద్దరూ ఫ్రెష్ అయ్యి రావడంతో ఇద్దరికీ ఆయింట్మెంట్ అప్లై చేసి వాళ్ళకి పెట్టిచ్చిన బాక్స్ లో నుంచి అన్నం ప్లేట్లో పెట్టి ఇద్దరికీ గోరుముద్దలు తినిపించి “కాళ్లు చేతులు నొప్పులు వస్తాయి కాబట్టి పెయిన్ కిల్లర్స్ కూడా ఇచ్చి కాసేపు రెస్ట్ తీసుకోమని” చెప్పింది…..

 

గాయత్రి వెళ్లి గదిలో అలా పడుకుని ఇలా నిద్రపోయింది కానీ కావ్య మాత్రం మొబైల్ నొక్కుతూ సాయంత్రం వరకు టైం పాస్ చేస్తే “గాయత్రీ కావ్య కాఫీ పకోడీలు రెడీగా ఉన్నాయి రండి ఇద్దరు” అని పిలవడంతో కళ్ళు నలుపుకుంటూ గాయత్రీ కిందకొస్తే కావ్య గదిలోకి వెళ్లి ఫోన్లో మునిగిపోయిన కావ్య నెత్తి మీద ఒక దెబ్బ వేసి “బయటికి రమ్మని” పిలిచి వెళ్లిపోవడంతో కావ్య తిట్టుకుంటూ బయటికి వచ్చింది….

 

“రోడ్డుమీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు?” అని గాయత్రి వాళ్ళ పెద్దమ్మ కావ్యని తిడుతూ ఉంటే “అక్క జాగ్రత్తగా నే నడిపింది పెద్దమ్మ…. ఎదురుగా వచ్చిన కార్ గుద్దేసింది” అని చెప్పడంతో “మనం జాగ్రత్తగా ఉన్న ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ వల్లే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళని కూడా గమనించుకోవాలి” అంటూ ఇద్దరికీ పకోడీలు ఉన్న ప్లేట్ ఇచ్చింది…..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue