పెరిగిన పొట్ట తో నిండుగా కనిపిస్తున్న తన భార్యని ప్రేమగా చూసుకొని, తన నుదుటన ముద్దు పెట్టుకుని, తన పొత్తికడుపు మీద చేయి పెట్టి, “బంగారం, డాడీ నీకోసం చాలా వెయిట్ చేస్తున్నాడు రా. తొందరగా వచ్చేయండి. అలా అని మమ్మీని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి. మమ్మీకి ఇబ్బంది అవ్వకుండా సేఫ్‌గా బయటికి వచ్చేయండి. సరేనా?” అంటూ నవ్వుతూ వైదేహి పొత్తికడుపు మీద ముద్దు పెట్టుకున్నాడు.
ఆ తర్వాత వైదేహి పక్కకి వచ్చేసి తన చేతిలో చేయి వేసి హాయిగా పడుకున్నాడు విక్కీ.
అలా చూస్తూ ఉండగానే వైదేహికి పూర్తిగా నెలలు నిండిపోయాయి. ఇక ఇంకొక పది రోజుల్లో డెలివరీ ఉంది అనగా, సుజాత గారు కూడా సాయానికి ఇంటికి వచ్చారు.
ఊర్మిళా గారు, విక్కీ, ఇంకా సుజాత గారు ముగ్గురు కలిసి వైదేహిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. డెలివరీకి ఇంకా ఐదు రోజులు ఉండగానే వైదేహికి ఉమ్మనీరు కారిపోతూ, నొప్పులు మొదలయ్యేసరికి వెంటనే ఉన్నపళంగా తనని తీసుకొని హాస్పిటల్‌కి స్టార్ట్ అయ్యాడు విక్కీ.