రూప తన కన్నీళ్లు తుడుచుకుంటూ …. తన అంతరాత్మ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని … ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా ఆ రూం నుంచి బయటికి వెళ్ళింది.
ఆ రూం డోర్ ఓపెన్ చేసుకొని చుట్టూ ఒకసారి చూసింది..అక్కడ ఎవరూ కనిపించలేదు బయట…
నేరుగా మెట్ల వైపు వెళ్లి ఫాస్ట్ గా మెట్లు అన్నీ దిగి కిందకి వెళ్ళే సరికి అక్కడ కూడా హాల్ అంత కాళిగా కనిపించింది.
చుట్టూ చూసి ఓపెన్ చేసి ఉన్న గుమ్మం నీ చూస్తూ … పరుగున బయటికి పారిపోవాలని అని ట్రై చేసింది కానీ ఎవరో రూప చెయ్యి పట్టుకొని ఒక గదిలోకి లాక్కొని వెళ్ళారు.