ఆద్య తన స్నేహితులైన రాగిణి, విద్యలకు మాత్రమే తెలిసిన రహస్య ప్రదేశానికి వెళ్తుంది. ఆ ముగ్గురూ తమ మనసులోని బాధలను, సంతోషాలను ఒకరితో ఒకరు పంచుకునే ప్రదేశం అది.
రాగిణి తన తల్లికి చెప్పి అక్కడికి వస్తే, విద్య తన తండ్రికి చెప్పి అక్కడికి వస్తుంది. ఆద్య అక్కడికి చేరుకునే సమయానికి రాగిణి, విద్య ఇద్దరూ అప్పటికే అక్కడ ఉంటారు.
అక్కడికి వచ్చిన ఆద్య ఒక్కసారిగా రాగిణిని గట్టిగా హత్తుకుని ఏడవడం మొదలుపెడుతుంది.
ఆద్యను అలా చూసిన రాగిణి కంగారుపడిపోతుంది.
రాగిణి:
ఏమైంది ఆద్యా? ఎందుకలా ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది?
ఆద్య కన్నీళ్లు తుడుచుకుంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది.