New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
╰┈➤నా సైకో సీనియర్ ᥫ᭡🪽 – 4

╰┈➤నా సైకో సీనియర్ ᥫ᭡🪽 – 4

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

దేవాన్ష్ మోకాళ్లపై ఉన్న ఆ అబ్బాయి ముందు ఒక ఎలక్ట్రిక్ ట్రిమ్మర్ విసిరాడు. ఆ అబ్బాయి జంకుతూ దానివైపు చూస్తుంటే…

 

 

 

“ఐ విల్ లెట్ యు గో…” అన్నాడు రోహన్ చాలా క్యాజువల్‌గా కుర్చీలో వెనక్కి వాలుతూ. “బట్… నువ్వు ఆ షేవర్ తీసుకుని, నీ చేతులతో నీ జుట్టు మొత్తం గుండు గీసుకుంటేనే! లేదంటే ఇక్కడినుండి నువ్వు నడుచుకుంటూ వెళ్లాలా, లేదా కారు టైర్ల కింద నలిగిపోవాలా డిసైడ్ చేస్తా … ఛాయిస్ ఈజ్ యువర్స్!”

 

 

 

ఆ మాట విన్న ఆ కుర్రాడికి భూమి కంపించినట్లు అనిపించింది. పబ్లిక్‌గా అది కూడా తన ఫ్రెండ్స్ ముందు గుండుతో తిరగడం ఎంత అవమానమో తలచుకుని, చేసేదేమీ లేక ఏడుస్తూ ఆ ట్రిమ్మర్ చేతిలోకి తీసుకుని తన తల పట్టుకున్నాడు.

 

 

“ఏంట్రా ఆలోచిస్తున్నావ్? టైమ్ లేదు ఇక్కడ… షేవ్ చేసుకుంటావా లేదా?” అని దేవాన్ష్ గట్టిగా అరిచేసరికి, నితిన్ ఉలిక్కిపడి ట్రిమ్మర్ ఆన్ చేశాడు.

 

 

 

కళ్లు గట్టిగా మూసుకుని వణుకుతున్న చేత్తో ట్రిమ్మర్‌ను తన తల మీద పెట్టుకున్నాడు. మొదటిసారి ఆ బ్లేడ్లు తలకు తగలగానే రాలి కింద పడుతున్న తన జుట్టును చూసి అతని గుండె పగిలిపోయింది. కన్నీళ్లు బుగ్గల మీద నుండి జారి నేల మీద పడుతున్నాయి. 

 

 

 

రోహన్ ఈగో శాటిస్‌ఫై అయినా, ఆ అబ్బాయి జుట్టు ట్రిమ్ చేసుకునే వరకు కుర్చీలోంచి కదల్లేదు. పెదవులపై ఆ సైడ్ స్మైల్ అలానే ఉంది.

 

 

నితిన్ ముందు భాగం మొత్తం ఏడుస్తూనే షేవ్ చేసుకున్నాడు. తలపై సగం జుట్టు పోయింది, ఎత్తుపల్లాలుగా అత్యంత వికారంగా తయారైంది అతని తల. ఇక వెనక భాగం చేతులు అందక, అతి కష్టం మీద ట్రిమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ దృశ్యం చూసి దేవ్ నవ్వుతున్నాడు.

 

 

 

సరిగ్గా అప్పుడే…

 

 

“స్టాప్!” అన్నాడు రోహన్. 

 

 

రోహన్ గొంతులోంచి వచ్చిన ఆ ఒక్క మాట అక్కడి వాతావరణాన్ని స్తంభింపజేసింది. ఆ వాయిస్ లో ఉన్న పవర్‌కి నితిన్ చేతులు ఆటోమేటిక్ గా ఆగిపోయాయి. ట్రిమ్మర్ కింద పడేశాడు.సగం గుండుతో, సగం జుట్టుతో ఉన్న నితిన్‌ని చూసి రోహన్ నెమ్మదిగా కుర్చీలోంచి లేచాడు.

 

 

 

జేబులో చేతులు పెట్టుకుని నితిన్ దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. అతనికి ఒక అడుగు దూరంలో ఆగి, కొద్దిగా ముందుకు వంగి వాడి కళ్లలోకి చూశాడు. ఆ బ్లూ ఐస్‌లో ఉన్న తీవ్రతకు నితిన్ ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయాడు.

 

 

 

“గుడ్… యు కెన్ గో నౌ,” అన్నాడు రోహన్ చల్లగా.

 

 

నితిన్ ప్రాణం లేచి వచ్చినట్లయింది. హమ్మయ్య అని గట్టిగా గాలి పీల్చుకోబోయే లోపే…

 

 

 

“బట్… ఇంకో ఫిఫ్టీన్ డేస్‌లో కాలేజ్ ఓపెన్ అవుతుంది. నువ్వు కాలేజ్‌కి వచ్చేటప్పుడు నీ హెయిర్ స్టైల్ ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఎలా ఉందో… ఆ సగం గుండుతోనే ఉండాలి. ఆ మిగిలిన హెయిర్ కానీ తీసి స్మార్ట్ గా వద్దామని ట్రై చేస్తే… ఆ తర్వాత నీకు ఇంతకంటే పెద్ద హెల్ (నరకం) చూపిస్తాను. మైండ్ ఇట్ !” అని వార్నింగ్ ఇచ్చాడు.

 

 

 

ఆ కండిషన్ వినగానే నితిన్ కళ్లు షాక్‌తో పెద్దవయ్యాయి. అంటే తను కాలేజ్‌లో అందరి ముందు ఈ జోకర్ లాంటి అరగుండుతో తిరగాలా? ఇది చంపడం కంటే దారుణమైన శిక్ష. ఎదురు చెప్పే ధైర్యం లేక తల దించాడు నితిన్ . రోహన్ వాడిని ఒక పురుగును చూసినట్లు చూసి, వెనక్కి తిరిగి స్టేడియం బయటకు నడిచాడు.

 

 

 

అతని వెనకే దేవాన్ష్, ఆరవ్ నవ్వుకుంటూ బైక్ రేసింగ్ గురించి మాట్లాడుకుంటూ నడుస్తుంటే, జై మాత్రం చుట్టూ ఏం జరిగిందో అతనికి సంబంధం లేనట్లు ఫోన్‌లో మునిగిపోయాడు.

 

 

 

 

“జై… కమ్ బ్రో!” అని దూరం నుండి ఆరవ్ పిలవగానే, జై తన ఫోన్ జేబులో పెట్టుకుని తలెత్తాడు. ఎదురుగా నేల మీద కూర్చుని ఏడుస్తున్న అరగుండుతో ఉన్న  నితిన్‌ని చూసి నెమ్మదిగా నడుచుకుంటూ వాడి దగ్గరకు వచ్చాడు. జై కళ్లలో కోపం లేదు, జాలి లేదు, కేవలం ఒక రకమైన శూన్యం మాత్రమే ఉంది.

 

 

 

“యువర్ నేమ్?” అని నొసలు రుద్దుకుంటూ అడిగాడు జై.

 

 

“ని… నితిన్,” వణుకుతూ చెప్పాడు.

 

 

“రైట్ నితిన్…” అన్నాడు జై చాలా ప్రశాంతంగా. “నువ్వు ఆ విరాట్ వెనుక తిరుగుతావ్ కదా? ‘RJ’ గురించి మాట్లాడేముందు  వాడి గురించి తెలిసి జాగ్రత్తగా ఉండాల్సింది. ఎనీవే… వెళ్లే దారిలో ఏదైనా సెలూన్ చూసుకుని ఆ మిగిలిన హెయిర్ కూడా రిమూవ్ చేయించుకో. ఫుల్ గా షేవ్ చేసెయ్.”

 

 

 

 

నితిన్ ఆశ్చర్యంగా జై వైపు చూశాడు. “కానీ… కానీ RJ అలా తీస్తే నన్ను  వదిలిపెట్టను అన్నాడు కదా?” అని భయంగా అడిగాడు.

 

 

 

“వాడితో నేను మాట్లాడుకుంటానులే. బట్… కాలేజ్ లో  వాడికి ఎక్కువ కనిపించి కోపం తెప్పించకు . వాడి ఈగోని టచ్ చేస్తూ ఇంకోసారి ఈ తప్పు రిపీట్ చెయ్యకు. చేస్తే… దట్ విల్ బి యువర్ లాస్ట్ డే ఆన్ ఎర్త్,” అని ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా,  కూల్‌గా వార్నింగ్ ఇచ్చి వాళ్ల వెనకనే వెళ్లిపోయాడు జై.

 

 

 

 

వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఆ రేస్ ట్రాక్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఆకాశంలో ఉన్న ఫ్లడ్ లైట్స్ వెలుతురులో, నేల పై మోకాళ్ల మీద కూర్చున్న నితిన్ పిడికిలి బిగించాడు. 

 

 

 

అప్పటివరకు అతని కళ్లలో ఉన్న భయం, కన్నీళ్లు ఇప్పుడు మాయమైపోయాయి. ఆ స్థానంలో అవమానం, పగ, కసి రగులుతున్నాయి. కన్నీళ్లతో నిండిన ఆ కళ్లు ఇప్పుడు ఎర్రగా మారాయి.

చేత్తో తన అరగుండును తడుముకున్నాడు. ప్రతి స్పర్శ వాడికి తన పరువు ఎలా గాల్లో కలిసిపోయిందో గుర్తుచేస్తోంది

 

 

 

‘డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు, ఎంతటి నీచానికైనా దిగజారొచ్చు, ఎవరూ ఏమీ అనలేరు అనే పొగరు కదరా మీకు! వేల కోట్ల ఆస్తి ఉంటే మనుషుల్ని పురుగుల్లా చూస్తారా? నిన్ను ఊరికే వదలను RJ ! నువ్వు ముంబై కింగ్ అని ఫీల్ అవుతున్నావేమో… నీ అహంకారాన్ని, నీ పొగరును మట్టిలో కలపకపోతే నా పేరు నితిన్ కాదు. నీ అంతు ఎలాగైనా తేలుస్తాను,’ అని అరగుండు మీద చెయ్యేసి కోపంతో శపథం చేసుకున్నాడు.

 

 

 

 

నెమ్మదిగా పైకి లేచాడు. నితిన్ మైండ్ లో ఇప్పుడు ఒకే ఒక పేరు మెదులుతోంది. ఈ ముంబైలో RJ కి ఎదురెళ్లగలిగే దమ్ము, ఆస్తి, పవర్ ఉన్న ఒకే ఒక్కడు… విరాట్!

 

 

 

“ముందు ఈ విషయం విరాట్ కి చెప్పాలి , ఆడైతేనే వీళ్ళని  ఎదిరించగలడు ” అని బయటకి వచ్చి ఆటో ఎక్కి ముందు సెలూన్ కి వెళ్ళాడు నితిన్….

 

 

ఇంకా ఉంది….