New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అగ్రిమెంట్ వైఫ్ – 1

అగ్రిమెంట్ వైఫ్ – 1

అది ఒక కళ్యాణ మండపం ఆ మండపం చాలా గ్రాండ్గా అట్టహాసంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది… బయట పార్కింగ్ ఏరియాలో బ్రాండెడ్ కార్స్ మల్టిపుల్ లైట్స్ తో ఫిక్స్ చేసిన ఫ్లెక్సీలు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి 

బిజినెస్ మాగ్నెట్, డాక్టర్స్ , ఇంజనీర్స్ , లాయర్స్ ఇలా ఒకరేంటి అన్ని రంగాలలోనూ ఉండే హై క్లాస్ పీపుల్ అంతా ఒక్కొక్కరుగా ఆ మ్యారేజ్ కి విచ్చేస్తున్నారు… కానీ వచ్చే వాళ్ళందరూ ఆ పెళ్లిని మనస్ఫూర్తిగా చూడడానికో లేకపోతే వాళ్ళ ఆశీస్సులు ఇవ్వడానికి మాత్రం కాదు ఇటువంటి అబ్బాయిని ఎవరు చేసుకున్నారో చూసి తరిద్దామని వారి మనసులో ఆలోచన 
బయటికి మాత్రం సూట్లు, బూట్లు తగిలించుకొని రాయల్టీ మెయింటైన్ చేస్తూ లోపలికి వచ్చిన మనసులో అక్కసును పెంచుకుంటూ అక్కడ గ్రాండ్ సిట్టింగ్ ఏరియాలో ఆసీనులై కూర్చుంటున్నారు 
కాస్త సమయానికి వాళ్లందరి ఎదురుచూపులకు తేరదించుతూ గ్రాండ్ లుక్ ఇచ్చే డ్యాన్సర్స్ మధ్య  ఒక నాలుగు చక్రాల వాహనం మీద కూర్చొని 24 క్యారెట్స్ గోల్డ్ తో చేసిన కుర్తి పైజామాలో రారాజులా మెరిసిపోతున్న అత్యంత అందగాడైన 30 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయి పెళ్ళికొడుకు గెటప్ లో స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు 
అతడిని చూస్తుండగానే అందరి కళ్ళు మెరిసాయి కానీ అది ఎంతో సేపు కాదు అతని డ్రెస్ లో ఉన్న కళ రాజసం మొహంలో ఏమాత్రం లేదు గంభీరంగా కఠినత్వంగా కాలేచిసే కళ్ళతో చూస్తూనే నాలుగు చక్రాల వాహనమైన వీల్ చైర్ లో వెనుక అతిథులు తన తల్లి తండ్రి తీసుకువచ్చి పెళ్లి పీటలపై కూర్చోబెడతారు 
అవును అతను రాజు కావచ్చు బిలినియర్లో ఒకరైన కోటీశ్వరుడు కావచ్చు కానీ మామూలు మనిషిలా నడవగలగే కాళ్లు లేని వైకల్యం ఉన్నవాడు 
ఇలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి అయినా ఎలా చేసుకుంటుంది కేవలం అతడి వెనుక డబ్బు కోసం పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆ ఇంటిని తన గుప్పెట్లో పెట్టుకొని తనకి నచ్చిన వాడితో తిరుగుతుంది అంతే తప్ప ఈ కాళ్లు లేని వాడితో కాపురం చేస్తుందా ఏంటి అనీ వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటున్న మాటలు పెళ్ళికొడుకుని చెవిన చేరుతాయి 
వెంటనే అతని మొహంలో అశాంతి అసహనం కొట్టొచ్చినట్లు కనిపించిన ఏం చేయలేని నీసహాయ స్థితిలో ఉన్న అతను మారు మాట్లాడకుండా పంతులుగారు చెప్పినట్లుగా గణపతి పూజ చేస్తున్నాడు 
కాసేపటికి బంగారు వర్ణంలో మెరిసిపోతూ మెడ నుండి నడుము వరకు ఏమాత్రం గ్యాప్ లేకుండా బంగారంతో రకరకాల నగలతో నిండిపోయిన తనని చూస్తుంటే అది మనిషా లేక బంగారపు బొమ్మ అని అనిపించేలా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పెళ్లికూతురు 
తనకి ఇరువైపులా కొంతమంది పెద్దలు తీసుకొని వస్తుండగా అడుగులో అడుగు వేస్తుంటే సిగ్గు బిడియంతో నడిచి వచ్చి పెళ్లి పీటల మీద రాకుమారిడి పక్కన రాజకుమారి కూర్చోగానే అతనికి అందంలో ఏ మాత్రం తీసిపోకుండా ఉన్న తనని చూసి ” పర్ఫెక్ట్ జంట ” అని అనుకోకుండా ఉండలేకపోయారు ఒక్క క్షణం చూస్తున్న వాళ్ళందరూ 
కానీ మరుక్షణం అతని వైకల్యం గుర్తుతెచ్చుకొని ” ఇది నిజంగా మనసులతో ముడి పడింది కాదు కదా డబ్బుతోనే కదా మూడు పడింది ” అని అనుకొని లైట్ తీసుకొని వదిలేసారు కానీ కొందరు చూపులు ఆ అమ్మాయి వైపు జాలిగా మళ్ళితే మరికొందరి చూపులు వంకరగా మల్లుతున్నాయి
అందరి చూపులను గమనిస్తున్న పెళ్లి కోడుకులో మరింత అసహనం తన భార్యని అందరూ అలా చూస్తుంటే కోపం వచ్చినా అది వాస్తవమే కదా అన్నా ఆలోచన అతని మదిలో నిండిపోగా శ్రద్ధగా పూజ చేయలేక అలాగని లేచి వెళ్లే దారి లేక తన అమ్మానాన్నలవైపు దీనంగా చూస్తుండగానే
బాబు అమ్మాయి మెడలో తాళి కట్టండి అన్న పంతులుగారు మాట వినిపించి దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి తాళిని తీసుకొని వేదమంత్రాల సాక్షిగా తన మెడలో మూడు ముళ్ళు వేసి ఇప్పటివరకు లేని ఒక అగ్రిమెంట్ వైఫ్ ను తన జీవితంలోకి తెచ్చుకుంటాడు
అలా వేదమంత్రాలు ఏడడుగులు బంధుమిత్రులు దైవ దీవెనలు సాక్షిగా మూడు ముళ్ళతో ఒకటైన ఈ బంధం కలహాలు లేని ప్రణయ కావ్యంగా మారుతుందో ?? లేక ఇద్దరి కలహాలతో ప్రలయాన్ని సృష్టిస్తుందో ?? విధి రాతకే తెలియాలి 
పెళ్లి తంతులన్నీ ముగిసి ఇంటికి చేరగానే పెద్ద మహల్ నీ చూడగానే ఆ అమ్మాయి మొహంలో వేల భావాలు… ఈ ఇంట్లోనా ఇకనుంచి నేను ఉండబోయేది అనే ప్రశ్న ఆమె మెదిలో కలవరపెడుతుంది 
గుమ్మం దగ్గరే జంటని నించోబెట్టి ఇద్దరికీ హారతి దిష్టి తీసి పేర్లు చెప్పమనీ పెళ్ళికొడుకు చెల్లి అక్షయ అడిగిన మాటకి చురుగ్గా ఒక లుక్ ఇస్తాడు 
దెబ్బకి సైలెంట్ అయిపోయిన పాప మారు మాట్లాడకుండా పక్కకి తప్పుకుంటుంది ఆ సన్నివేశాన్ని చూస్తున్నా పెళ్లికూతురి మదిలో కలవరం మొదలవుతుంది.. కంటి చూపులతోనే భయపెడుతున్న అతను తీరుకి ముచ్చమటలు పడుతున్నాయి 
ఇంట్లోకి తీసుకువెళ్లిన మరుక్షణం ఎవరి సహాయం లేకుండానే తన వీల్ చైర్ ని తోసుకుంటూ కిందే ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోతాడు పెళ్ళికొడుకు అలియాస్ రవితేజ మహేంద్ర వర్మ ( అందరూ తేజ్ అంటారు ) 
వెళ్తున్న అతను వైపే దీనంగా చూస్తున్న ఆమెని గెస్ట్ రూమ్ లోకి తీసుకువెళ్లి ఇప్పటికి రెస్ట్ తీసుకో రేపు మార్నింగ్ వ్రతం ఉంది అప్పటికి బ్యూటిషన్ వస్తారు నిన్ను రెడీ చేయడానికి అని కొట్టినట్లుగానే చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు తన అత్తగారు మహాలక్ష్మి గారు
డోర్ గడియ పెట్టేసి ఆ డోర్ కి జారబడి దిక్కులు పెకటిలెల్ల ఏడుస్తుంది… అప్పటివరకు మౌనం గా రోధిస్తున్న ఆమె మనసు ఒక్కసారిగా పురి విప్పిన నెమలిలా తన బాధను అంత బయటికి వెళ్ళగాకి తనివి తీరా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి అలాగే కిందకి ఒరిగిపోతుంది 
మర్నాడు ఉదయం బంధుమిత్రుల సమక్షంలో ఇంటి నిండా మామిడి తోరణాలు అలంకరించి సత్యనారాయణ వ్రతం జరిపించారు యాదృచ్ఛికంగానే 
ఆ వ్రతంలో పెళ్లికూతురు కళ్ళు గుమ్మం వైపు మల్లుతూనే ఉన్నాయి తన వాళ్ళు తన కోసం వస్తారేమో అని కానీ చివరి దశ వచ్చే వరకు కూడా వాళ్ళు రాకపోయేసరికి ఇంకా ఆశలు వదిలేసుకొని పంటి బిగువున దుఃఖాన్ని దిగమింగి బొమ్మలా ఉండిపోయింది 
అదే రోజు రాత్రికి కొత్త దంపతులు ఇద్దరికీ శోభనం ఏర్పాటు చేశారు… రూమ్ మొత్తం ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా మల్లెలు మాలలు మీద నుంచి కింద వరకు వేలాడదీసి… బెడ్ మొత్తం జాజిపూలు మల్లెపువ్వులతో నిండిపోగా మధ్యలో రెడ్ కలర్ గులాబీ రేకులతో హాట్ సింబల్ వేసి పిల్లోస్ మీద కూడా చిన్న చిన్న హాట్ సింబల్స్ తో డెకరేట్ చేసి… పక్కనే టేబుల్ పై సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి పెట్టి పాల గ్లాస్ తో శోభనం గది అందంగా ముస్తాబై ఉంది
స్టోరీ కంటిన్యూస్….