New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అగ్రిమెంట్ వైఫ్ – 2

అగ్రిమెంట్ వైఫ్ – 2

ఆ రోజు రాత్రి శోభనానికి ఏర్పాటు చేశారు పెద్దవాళ్లు

అమ్మల్లికల కబుర్లు అల్లరి నవ్వులు మధ్య ఆ రూమ్ లో అడుగుపెట్టిన పెళ్లికూతురు కి ఎక్కడ తేజ్ జాడ కనిపించలేదు
ఎక్కడికి వెళ్లారు ఈయన అని మనసులో అనుకుంటూ తల దించుకునే కళ్ళని మాత్రం పైకెత్తి చుట్టూ పరిశీలిస్తున్న ఆమెకి బాల్కనీలో లీలగా ఒక ఆకారం కనిపించి డోర్ గడియ పెట్టేసి నెమ్మదిగా అటువైపు అడుగులు వేస్తుంది 
అతనికి మూడు అడుగుల దూరంలో ఆగి ఇంతకు ముందు అతని కోపాన్ని చూసిన తనకి భయంగా ఉన్న నెమ్మదిగా గొంతు పెగల్చి ” ఏవండి ” అని చిన్నగా పిలుస్తుంది
అప్పటి వరకు ఆకాశంలోకి చూస్తూ ఏవో ఆలోచనల్లో మునిగిపోయిన తేజ్ ఇటు వైపుకి చూస్తాడు… పాల సముద్రంలో నుంచి మునిగి తేలినట్టుగా తెల్లగా ముద్దుగా ఉన్న తన రూపం ఎర్రంచు ఉన్న తెల్లటి పట్టుచీర ఉదయంల మరీ ఎక్కువ కాకుండా సింపుల్గా వేసిన రెండు నగలతో ఎర్రగా పండిన గోరింటాకు చేతులకి మరింత అందాన్ని ఇచ్చే చేతినిండా గాజులు బిడియాంగా వేళ్ళు మధ్య నలిగిపోతున్న ఆమె చీర కొంగు గుండ్రంగా ఉన్న కళ్ళు భయంతో అదురుతున్న ఎర్రటి పెదవులు తనని పైనుంచి కింద వరకు చూస్తుంటే ” బ్యూటిఫుల్ ”  అని అనుకోకుండా ఉండలేకపోయాడు 
కానీ మరుక్షణం ” రేయ్ తను నీకు మాత్రమే సొంతం కాదు ఇంతకుముందు ఇదే డబ్బు కోసం ఎంతమందికి సొంతమైందో అని ”  అతని మైండ్ చెప్పేసరికి ట్రాన్స్ లో నుంచి బయటికి వచ్చి 
విసురుగా మొహం పక్కకు తిప్పేసుకుని చూడు మా వాళ్లు నీకు ఏం చెప్పారో తెలియదు కానీ నా గురించి నీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను 
గది బయట వరకు మనం భార్యాభర్తలం కావచ్చు కానీ ఈ గది లోపల అడుగు పెట్టిన మరుక్షణం నువ్వు నేను వేరు వేరు భిన్న దృవాలు !! నువ్వు నా పట్ల ఇంట్రెస్ట్ ఏమీ చూపించాల్సిన అవసరం లేదు నీ లిమిట్స్ లో నువ్వు ఉంటూ నాకు దూరంగా ఉంటే బాగుంటుంది 
అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు ఏదైతే ఆశించి నా జీవితంలోకి ఈ ఇంట్లోకి అడుగు పెట్టావో అది ఎప్పటికీ నేను జరగనివ్వను… కాలు లేని వీడు ఏం చేస్తాడు అని నువ్వు అనుకోవచ్చు కానీ నా కోపాన్ని పరీక్షించకుండా నువ్వు నీ హద్దులో ఉండడమే నీకు చాలా మంచిది 
నాకు కాళ్ళు లేకపోవచ్చు కానీ ఒంట్లో బలుపు మాత్రం బోలెడు ఉంది… సో ” మచ్ బెటర్ ఫర్ యు ఇఫ్ యూ స్టే అవే ఫ్రమ్ మీ ” అని సీరియస్ గా చెప్పి బెడ్ దగ్గరికి వెళ్లి తనంతట తానుగా పడుకోవడానికి చాలా ట్రై చేస్తాడు 
కానీ అసలు కుదరలేదు ఫలితంగా అతనిలో కోపం మరింత రెట్టింపు అయింది తన మీద తనకే అసహ్యం అది ఎవరికి చెప్పుకోవాలో ఎలా చూపించాలో కూడా తెలియక సతమతమైపోతున్నాడు 
అతని చిన్ని మనసు పడే సంఘర్షణ ఎవరికి తెలియడం లేదు తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేదు… కానీ తను అతని ఇబ్బందిని గమనించి తట పటాయిస్తూనే నెమ్మదిగా అడుగులు వేస్తూ అతనికి చేయి అందించి నెమ్మదిగా పడుకోబెడుతుంది 
అది అతనికి నచ్చకపోయినా ఏం చేయలేక సైలెంట్ అయిపోతాడు… వెచ్చని సూర్యకిరణాలు మోమును తాకుతుండేసరికి నెమ్మదిగా కళ్ళు తెరిచిన అతనికి కాలీ రూమ్ దర్శనం ఇస్తుంది
ఓహ్ అప్పుడే లేచిందా అని అనుకొని మళ్లీ అంతలోనే అవునులే కొన్ని రోజులు మంచిదానిగా నటించి అందర్నీ ట్రాప్ చేయాలంటే ఆ మాత్రం కష్టపడాలి మరి అని అనుకుంటూ డైలీ అతని పనులు చేసే సర్వెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు 
కాసేపటికి అతను రాగ ఫ్రెష్ అయ్యి డ్రెస్సు పై కిందకి వచ్చిన అతనికి వంటి గదిలో టిఫిన్ ప్రిపేర్ చేస్తూ కనిపిస్తుంది అతని భార్య కానీ భార్య మధురిమ 
సింపుల్ జార్జెట్ సారీ కట్టుకొని తలస్నానం చేసిందేమో ఇంకా ఆరకపోవడంతో జస్ట్ చిన్న క్లిప్ పెట్టి వదిలేసి చేతినిండా గాజులతో నుదుటిన కుంకుమ బొట్టుతో పాపిటల్లో సింధూరం సింపుల్ గా ఉన్న లక్ష్మీదేవి కల ఉట్టిపడుతున్న తన మోముని ఒక్క నిమిషం చూసి చూపు మరలుచుకుంటాడు 
ఏవండీ కాఫీ అని వినిపించిన తీయని స్వరానికి తలెతి పెడసరిగా కాఫీ తీసుకొని సిప్ చేస్తాడు… అప్పటివరకు కోపంగా ముడుచుకున్న అతడి పెదవులు కాపీ టేస్ట్ కి అందంగా విచ్చుకుంటాయి 
పర్వాలేదు బాగానే చేసింది మనసులో అనుకుంటూ అందులోనే అతని ఆటిట్యూడ్ ని బయటికి తీసి నీ చేతి కోఫీ నీలాగే చెత్తగా ఉంది అని చెప్పి తను ముఖానికి విసిరి కొడతాడు
అక్కడే ఉన్న అతని పేరు తేజ్ ఏంటి ఇలా ఎవరైనా చేస్తారా అని సీరియస్గా అరిచిన నా ఇష్టం నా భార్య నేను ఏదైనా చేసుకుంటాను మీకేం రైట్స్ లేవు
పెళ్లి చేసే వరకే మీ బాధ్యత వన్స్ తన మెడలో మూడు ముళ్ళు వేసాను కాబట్టి ఇట్స్ మై ప్రాపర్టీ నేను ఏదైనా చేసుకుంటాను అని సీరియస్ గా చెప్పి అక్కడి నుంచి రూమ్ లోకి వెళ్ళిపోతాడు… అతడికి ఇష్టం లేకపోయినా ఎంత తనమీద అరిచినా అతనికి కావాల్సిన చిన్నచిన్న పనులు చేస్తూ అతడికి చెయ్యి అందిస్తూ పక్కనే నిలుస్తుంది మధు 
దాని ఫలితంగా సూటిపోటి మాటలు చెంప దెబ్బలు అతడి నుంచి ఆమెకు చాలానే గిఫ్ట్ వచ్చాయి
ఇలాగే రోజులు గడుస్తున్నాయి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎవరికీ తెలియదు ఇంఫాక్ట్ అసలు మాట్లాడుకోవట్లేదు 
డబ్బును చూసి తను నా జీవితంలోకి వచ్చింది ఇది ఒక కాంట్రాక్ట్ అని అతను ఫీల్ అవుతుంటే తను మాత్రం అతడికి ఇష్టం లేకుండా నేను వెళ్లి ఎలా మాట్లాడగలను నా నిస్సహాయతను వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే ఏం చేసినా నేను భరించాల్సిందే అని తనలో తాను మదన పడుతూనే రోజులు నెట్టుకోస్తుంది
అప్పుడే పెళ్లి జరిగి రెండు వారాలు దాటింది ఈ రెండు వారాలలో ఏ రోజు కూడా తన వాళ్ళు తన గురించి రాలేదు సరి కదా కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు అంతేలే నన్ను బలవంతంగా వదిలించుకున్నప్పుడు నాకోసం వాళ్ళు ఎందుకు తపన పడతారు నేనే పిచ్చిదానిలా వాళ్ల గురించి ఆలోచిస్తున్నాను అని తనలో తానే నిరాశగా అనుకుంటూ ఉండేది మధు 
మరోవైపు అత్తింట్లో తన పాత్ర కేవలం కొని తెచ్చుకున్న పనిమనిషి గానే మిగిలిపోయింది… కనిపిస్తే చాలు సింహంల సీరియస్ అయ్యే భర్త ఎదురుపడిన పలకరించకుండా హీనంగా చూసే అత్త మామ డబ్బు లేకుండా వచ్చిన తనని అసహ్యించుకున్న ఆడపడుచు
ఆ ఇంట్లో ప్రతి ఒక్కరితో తనకి బంధం ముడిపడి ఉన్నా ఎటువంటి సంబంధం లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది 
ఇది ఇలా ఉండగా ఒకరోజు నైట్ డిన్నర్ చేస్తున్నప్పుడు తేజ్ వాళ్ళ నాన్న భూపతి వర్మ గారు ఆఫీసులో జరిగిన ఒక విషయాన్ని ప్రస్తావించారు 
అది విన్న అందరూ షాక్ అయ్యారు !! బాధగా తేజ్ వైపు చూస్తారు
స్టోరీ కంటిన్యూస్….
ఎంటా విషయం ?? ఆ ప్రస్తావన వల్ల మధు జీవితం ఎటు దారి తీస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే స్టోరీని మీస్ అవ్వకుండా చదివేయండి