స్వర్ణ మాత్రం అతని చూపుకు సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా బయటకు వెళ్లిపోయింది….
స్వర్ణ వెళ్లిపోయిన దారినే క్షణం పాటు చూస్తూ నిలిచిపోయిన ఇంద్ర వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకుని మళ్లీ ప్రాజెక్ట్ వివరించడం మొదలుపెట్టాడు… కానీ అతని మనసు మాత్రం మీటింగ్ హాల్‌లో లేదు వెళ్లిన స్వర్ణ దగ్గరే ఉంది…
మీటింగ్ హాల్ నుండి బయటకు వచ్చిన స్వర్ణ వేగంగా నడుచుకుంటూ కారిడార్ చివర ఉన్న గ్లాస్ వాల్ దగ్గర ఆగిపోయి ఒక గాఢమైన నిట్టూర్పు విడిచి కళ్లను మూసుకుంది…
ఏమవుతోంది నాకు???? అని తననే తాను ప్రశ్నించుకుంది…. ఎందుకంటే ఇన్నిరోజులు ఇంద్ర తనను పట్టించుకోకపోవడం… కోప్పడడం… కఠినంగా మాట్లాడడం మాత్రమే చూసిన తనకు ఇప్పుడు ఇంద్ర ప్రతి మాట… ప్రతి చూపు… ప్రతి చిన్న చర్య కూడా కొత్తగా అనిపిస్తోంది…